బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకుంటే..మాకే లాభం-పాక్ కు భారత్ షాకింగ్ కౌంటర్..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కనబెట్టింది. దీంతో పాకిస్తాన్ కు నీటి కరవు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపేస్తే అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తోంది. ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది.

సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం వల్ల తమపై ప్రభావం పడుతుందని, కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపేస్తే మీ మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్నా భారత్ కు ఎలాంటి నష్టం జరగబోతందంటూ లెక్కలతో సహా అసోం సీఎం ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారత్ పై బ్రహ్మపుత్ర నీటి ప్రభావం ఎంతో తేల్చిచెప్పేశారు.

himanta biswa sarma s counter to Pakistan s what if china stops Brahmaputra water argument

చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు.
బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకి పోదని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30-35 శాతం మాత్రమే అన్నారు. అదీ ఎక్కువగా హిమనీ నదాలు కరగడం, పరిమిత టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు.మిగిలిన 65-70 శాతం నీరు భారత్ లోనే ఉత్పత్తి అవుతుందన్నారు.

himanta biswa sarma s counter to Pakistan s what if china stops Brahmaputra water argument

అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయలో కుండపోత రుతుపవనాల వర్షపాతం, సుబంసిరి, లోహిత్, కమెంగ్, మానస్, ధనసిరి, జియా-భరాలి, కోపిలి వంటి ప్రధాన ఉపనదులు, ఖాసీ, గారో, జైంతియా కొండల నుండి కృష్ణా, దిగారు, కుల్సి వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతాయన్నారు. ఇండో-చైనా సరిహద్దు వద్ద (ట్యూటింగ్): ప్రవాహం 2 వేల నుంచి 3 వేల క్యూబిక్ మీటర్లు, అస్సాం మైదానాలలో (ఉదా., గౌహతి) వర్షాకాలంలో ప్రవాహం 15 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల వరకూ పెరుగుతుందన్నారు.

కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్ లో ప్రవాహాలపైనే ఆధారపడి ఉందన్నారు. ఇది వర్షాధార భారతీయ నదీ వ్యవస్థ అని, భారత భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత బలపడుతుందని గుర్తుచేశారు. పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ (చైనా ఎప్పుడూ బెదిరించలేదు లేదా ఏ అధికారిక వేదికలోనూ సూచించలేదు), వాస్తవానికి అది అస్సాంలో వార్షిక వరదలను తగ్గించడానికి భారతదేశానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ వరదలు ప్రతి సంవత్సరం లక్షలాది మందిని నిర్వాసితులను చేసి జీవనోపాధిని నాశనం చేస్తున్నాయని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+