మన్మోహన్‌తో లంచ్: 'నీనాని ఒబామా ఆహ్వానించాలి'
వాషింగ్టన్: మిస్ అమెరికా నీనా దావులూరిని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు వైట్ హౌస్‌లో విందుకు ఆహ్వానిస్తారని తాను ఆశిస్తున్నానని మాజీ అమెరికన్ దౌత్యవేత్త ఒకరు అన్నారు. ఈ నెల 27న శ్వేతసౌధంలో మన్మోహన్, ఒబామాలు కలవనున్నారు.
ఈ నేపథ్యంలో విందుకు నీనా దావులూరిని కూడా ఆహ్వానిస్తే అమెరికాలో ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలకు గుర్తింపు కూడా లభించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

గతంలో స్పెల్-బి పోటీల్లో ప్రవాస భారతీయ విద్యార్థి విజయం సాధించాడని, తాజాగా మిస్ అమెరికా కిరీటాన్ని నీనా సొంతం చేసుకుందని, ఈ నేపథ్యంలో అమెరికన్ సమాజం వారి సేవలను గుర్తించాలని భావిస్తున్నారు.
కాగా, నీనా దావులూరి ఇటీవలె మిస్ అమెరికా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈమె స్వస్థలం కృష్ణా జిల్లా. 15 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఆమె కిరీటం సొంతం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications