coronavirus spread:AC ద్వారా వైరస్, రెస్టారెంట్‌లో 9 మందికి సోకిన రక్కసి..
కరోనా వైరస్ ఆవిర్భవించింది చైనాలోని వుహాన్‌లో.. అయితే వైరస్ వ్యాప్తి చెందిన క్రమంలో వుహాన్‌లో లాక్ డౌన్ విధించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే వైరస్ సోకిన ఒకరు వుహాన్ నుంచి ఒకరు గ్వాంజు వెళ్లి రెస్టారెంట్‌లో భోజనం చేశారు. అక్కడ వైరస్ ఏసీ గుండా మూడు కుటుంబాలకు సోకాయి. వారికి వైరస్ ఎలా సోకిందని చైనా అధికారులు చేసిన పరిశోధనలో నిజం వెలుగుచూసింది.

9 మందికి వైరస్..
రెస్టారెంట్‌లో భోజనం చేసిన సమయంలో సమీపంలో ఉన్న తొమ్మిది మందికి వైరస్ సోకింది. అయితే వీరిలో ఒకరికొకరు పరిచయం లేకపోవడం విశేషం. అయితే హోటల్‌లో పనిచేస్తోన్న ఇతరులు, సిబ్బంది మొత్తం 73 మంది మాత్రం వైరస్ బారినపపడలేదని చైనా సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపినట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది.

ఫ్యామిలీ నుంచి వైరస్..
రెస్టారెంట్‌లో కూర్చొన్న ఫ్యామిలీ ‘ఏ' నుంచి ఫ్యామిలీ ‘బీ', ఫ్యామిలీ ‘సీ'కి ఏసీ ద్వారా వైరస్ సోకింది. వారు దగ్గినప్పుడు వాయువు ద్వారా వైరస్ ఏసీలోకి వెళ్లి.. తిరిగి బయటకు వచ్చింది. అలా రెస్టారెంట్‌లో కూర్చొన్న 63 ఏళ్ల వృద్దురాలికి తర్వాత దగ్గు, జ్వరం వచ్చింది. తర్వాత ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు వారాల్లో ఇలా 9 మంది వరకు వైరస్ సోకింది. అయితే వారంతా అదే రెస్టారెంట్ వెళ్లిన వారు అని గుర్తించారు.
Recommended Video

మహిళా.. ఫ్యామిలీ మెంబర్స్
వైరస్ సోకిన వారిలో నలుగురు మహిళ బంధువులు కాగా.. మిగిలిన వారు అక్కడ కూర్చొన్న మిగతా వారు. ఫ్యామిలీ ‘ఏ' ఆశీనులు కాగా.. వారు ద్వారా ఏసీలోకి గాలి ప్రవేశించింది. పక్కనే ఫ్యామిలీ ‘సీ'కి వైరస్ సోకింది. ఇటు పక్కన ఉన్న ఫ్యామిలీ ‘బీ'కి కూడా వైరస్ సోకింది. ఇలా 9 మందికి వైరస్ వచ్చింది. అయితే ఆ ఏసీకి దూరంగా ఉన్నవారికి వైరస్ సోకలేదని అధికారులు పేర్కొన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications