మీకిదేం పోయేకాలంరా అయ్యా..సెక్స్ వర్కర్లపై..ఛీఛీ..!!

విదేశాలకు వెళ్లిన కొందరు భారతీయులు మన దేశ పరువును మంటకలుపుతున్నారు. అక్కడికి పర్యాటకులుగా వెళ్లే కొందరు.. చోరీలకు పాల్పడుతూ జైలుపాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సింగపూర్‌లో వెలుగు చూసింది. ఇంతకీ సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన ఇండియన్స్ ఏం చేశారు..?

సింగపూర్‌... మంచి హాలిడే స్పాట్. ఆదేశంలో భారతీయుల జనాభా కూడా ఓ మోస్తారు ఉంటుంది. అక్కడికే వెళ్లి భారతీయులు సెటిల్ అయ్యారు కూడా. వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ సింగపూర్‌లోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక పర్యాటక పరంగా కూడా సింగపూర్‌ ఏ మాత్రం తీసిపోదు. తక్కువ బడ్జెట్‌లో ఆ దేశాన్ని చుట్టి రావొచ్చని చాలామంది ఇండియన్స్ భావిస్తుంటారు. ఇలా భావించి తమిళనాడుకు చెందిన ఆరోక్యసామి డైసన్, రాజేంద్రన్ మైలారసన్‌లు సింగపూర్‌కు వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టూరిస్టుల్లా అక్కడికి వెళ్లారు. సింగపూర్‌లో లిటిల్ ఇండియాగా పిలువబడే ప్రాంతానికి వీరిద్దరూ వెళ్లారు. కథ ఇంతవరకూ బాగానే ఉంది.ఆ తర్వాతే వారు చేసిన పనితో వారి తలరాతే మారిపోయింది.

how-two-indian-men-targeted-s-x-workers-in-singapores-little-india

సెక్స్ వర్కర్లతో...
ఈ ఏడాది ఏప్రిల్‌ 24వ తేదీన సింగపూర్‌కు వెళ్లిన ఆరోక్యసామి, రాజేంద్రన్‌లు సెక్స్ వర్కర్లతో ఎంజాయ్ చేద్దామనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ బ్రోకర్‌ను కలవగా ఇద్దరి అమ్మాయిలకు సంబంధించిన వివరాలను వారికిచ్చాడు.సెక్స్ వర్కర్లతో ఎంజాయ్ కంటే కూడా వీరి కన్ను వారి వస్తువులపై పడింది. ఇంకేముందు ముందుగా ఆరోక్యసామి ఆ అమ్మాయిల వద్ద ఉన్న డబ్బులు, నగలను దోచేయాలని గట్టిగా ఫిక్స్ అయి.. తన ప్లాన్‌ను రాజేంద్రన్‌కు చెప్పాడు. అమ్మాయిలను జలాన్ బెసార్‌లోని హోటల్ గదికి రమ్మనాడు. అందులో ముందుగా ఒక అమ్మాయి హోటల్ గదికి చేరుకుంది. ఆరోక్యసామి,రాజేంద్రన్‌లు అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

అమ్మాయి చేతులు కాళ్లు కట్టేశారు. శృంగారంలో ఇదొక భాగమని భావించిన అమ్మాయి ఇందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత రొమాన్స్ చేయడం మాని అమ్మాయిపై దాడి చేశారు.ఆమె వద్ద ఉన్న నగలు, బ్యాంక్ కార్డులు, 2వేల డాలర్ల నగదు, పాస్‌పోర్టును దోచుకున్నారు. ఆ తర్వాత రెండో సెక్స్ వర్కర్‌ను అదే రోజు రాత్రి కలిశారు.ఆమె కూడా వచ్చి రాగానే తన వద్ద ఉన్న నగలు, డబ్బులు, ఇతర వస్తువులను దోచేశారు. అక్కడి నుంచి పరార్ అయ్యారు. వెంటనే ఈ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరోక్యసామి, రాజేంద్రన్‌లను పట్టుకుని జైల్లో వేశారు.

ఇదంతా ఎందుకు చేశారు..?
సెక్స్ వర్కర్లని బుక్ చేసుకుని వారి వస్తువులనే లూటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులు ప్రశ్నించగా.. ఇందుకు ఆరోక్య సామి సమాధానం ఇచ్చాడు. తన తండ్రి గతేడాది చనిపోయారని తనకు ముగ్గురు సోదరీమణులు ఉన్నారని వెల్లడించారు. అందులో ఒకరికి పెళ్లయిందని మిగతా వారి పెళ్లి చేసేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇక రెండో వ్యక్తి రాజేంద్రన్ తనకు ఆర్థిక కష్టాలున్నాయని అందుకే చోరీకి పాల్పడినట్లు వెల్లడించాడు.

ఇక నిందితులను కోర్టులో హాజరుపర్చగా తమకు శిక్ష తగ్గించాలని జడ్జిని వేడుకున్నారు. దీంతో జడ్జి వీరికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. అంతేకాదు నేరం చేసినట్లు అంగీకరించడంతో వారికి 12 బెత్తం దెబ్బలు కూడా శిక్షలో భాగంగా విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+