కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం: 41 మంది మృతి, వీరిలో ఎక్కువమంది భారతీయులు

కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. మరణించిన వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని తెలిసింది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్​ జిల్లాలో ఈ ఘోర అగ్ని ప్రమాద ఘటన జరిగింది.

బుధవారం తెల్లవారుజామున హౌసింగ్ వర్కర్స్​​‌లోని ఆరంతస్తుల భవనంలోని ఓ వంటగది నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. క్రమంగా భవనం మొత్తం వ్యాపించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు .

Huge fire accident in Kuwait 41 killed some indians among dead

కాగా, ఈ భవనంలో సుమారు 160 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారిలో భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కువైట్ ఉప ప్రధాని ఫహాద్ యూసఫ్ అల్ సబా.. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు . భవనం యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. భవనం యజమానిని, ఈ ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 40 మందికిపైగా మరణించారని, మరో 50 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారత ఎంబసీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదంపై కువైట్ అధికారుల నుంచి మరింత సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+