స్నేక్ డ్రెస్ తెచ్చిన తంటా: సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్న భార్యకు బడితపూజ
ప్రపంచం ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతోంది. కాలంతో పాటు ఫ్యాషన్ కూడా అంతే వేగంగా వృద్ధి చెందుతోంది. ఫ్యాషన్ పేరుతో వింత పోకడలకు పోయి ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితే ఒక మహిళ ఎదుర్కొంది. తాను కొన్న కొత్త బట్టలతో భర్తకు సర్ప్రైజ్ ఇయ్యాలని భావించి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా... ఆస్ట్రేలియాలో.

వింతపోకడలకు పోయి ప్రాణాలమీదకు...
ఆస్ట్రేలియాలో ఓ భార్య వింత పోకడలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంది. పాము డిజైన్ వచ్చిన దుస్తులు కొనింది. భర్త ఇంటికొచ్చేసరికి ఆ దుస్తులను ధరించి ఆయనకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించింది. భర్త ఆఫీసు నుంచి వచ్చే సమయానికి పడక గదిలో లైట్లు ఆపి బెడ్‌పై పడుకుంది. చిన్నగా ఆమె నిద్రలోకి జారుకుంది. ఇక ఆఫీసు నుంచి ఎప్పుడో రాత్రి భర్త ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న భర్త అలసటగా ఉంటడంతో కాస్త బెడ్‌రూంలో రెస్టు తీసుకుందామని అటుగా వెళ్లాడు.

పడకపై పాములు కనిపించడంతో చితకబాదిన భర్త
బెడ్‌రూంలోకి వెళ్లిన ఆయనకు పడకపై పాములు కనిపించాయి. వెంటనే పక్కనే ఉన్న బేస్ బాల్ బ్యాట్ తీసుకొచ్చి పామును చితకబాదాడు. చితకబాదుతున్న సమయంలో గట్టిగా కేకలు వేయడంతో ఏంటా అని లైటు వేసి చూశాడు. అప్పటి దాకా గది చీకటిగా ఉన్నింది. లైటువేసి చూసిన భర్త షాక్ అయ్యాడు . తను చితకబాదింది పామును కాదని అతని భార్యను అని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు.

విరిగిపోయిన భార్య కాళ్లు
ఇలా ఎందుకు చేశావ్ అని భార్యను అడుగగా.. ఏదో మీకు సర్‌ప్రైజ్ ఇద్దామని అలా చేశానని చెప్పింది. నిజంగానే పాము అనుకుని భర్త... భార్య కాళ్లను చితకబాదడంతో తీవ్ర గాయాలయ్యాయి. అసలు పాము డిజైన్‌లో ఉన్న లెగ్గింగ్ ఎలా వేసుకున్నావంటూ భార్యపై కేకలు వేశాడు. కాళ్ల నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. భార్యను పరీక్షించిన వైద్యులు ఆమె కాళ్లు విరిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆయన చేసని పనికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో భర్త ఉన్నాడు. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications