ఐ హేట్ ఉమెన్: యువకుడి ప్రతీకారం
రావల్ పిండి (పాకిస్థాన్): సవతి తల్లి వేధింపులకు విసుగెత్తిన ఓ యువకుడు క్రూరంగా మారాడు. సవతి తల్లి మీద ఉన్న కసితో రోడ్ల మీద కనిపించిన మహిళల మీద పదునైన ఆయుధంతో దాడులు చేశాడు.
ఈ దాడిలో ఇప్పటి వరకు 17 మందికి తీవ్రగాయాలైనాయి. ఇతని దాడిలో ఓ నర్సు ప్రాణాలు విడిచింది. పాకిస్థాన్ లోని రావల్ పిండిలో ఈ దాడులు జరిగాయని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి మాలిక్ జుల్ఫికర్ హుస్సేన్ తెలిపారు.
రావల్ పిండిలోని గారిసన్ నగర్ లో మహమ్మద్ ఆలీ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్న తనంలోనే ఆలీ తల్లి మరణించింది. తరువాత అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు.

అప్పటి నుంచి సవతి తల్లి ఆలీని తీవ్రంగా హింసించింది. సవతి తల్లి వేధింపులతో విసిగిపోయి ఆమె మీద హత్యాయత్నం చేశాడు. చివరికి మహిళలంటే విరక్తి పెంచుకున్నాడు. పదునైన కత్తి పట్టుకుని రోడ్ల మీదపడ్డాడు.
ఒంటరిగా కనపడిన ప్రతి మహిళ మీద దాడి చేశాడు. గత జనవరి నుంచి ఇప్పటి వకరు 17 మంది మహిళల మీద దాడులు చేశాడని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు తెలిపారు. ఇతని దాడిలో ఓ నర్స్ తీవ్రగాయాలై మరణించింది. రావల్ పిండిలోని వీధుల్లోనే ఈ దాడులు జరిగాయని దర్యాప్తు చేస్తున్న అధికారి మాలిక్ జుల్ఫికర్ హుస్సేన్ చెప్పారు.












Click it and Unblock the Notifications