పాక్‌లో బాగా చూశారు, ఊహించలేదు: బిఎస్ఎఫ్ జవాన్
ఇస్లామాబాద్: చెనాబ్ నదిలో పడి పాకిస్తాన్ దేశంలోకి కొట్టుకుపోయిన బిఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్ ఆ దేశంలో మర్యాదను చూసి ఆశ్చర్యపోయాడు. పాకిస్తాన్ రేంజర్స్ అతన్ని బయటకు తీశారు. తాను ఊహించినదాని కన్నా తనను పాకిస్తాన్‌లో బాగా చూశారని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
తనను బిఎస్ఎఫ్ అధికారులకు అప్పగించడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు తన పడవ ప్రమాదవశాత్తు పాకిస్తాన్‌లో వెళ్లిందని, భారీ ప్రవాహం కారణంగా పడవ నియంత్రణ కోల్పోయిందని ఆయన చెప్పారు.
తన సహచరులు ఈదుకుంటూ బయటకు వెళ్లిపోయారని, తనకు ఈత రాదని చెప్పారు. పడవలో తాను పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లిపోయానని, తాను పాకిస్తాన్ పోస్ట్ వద్ద నదిలోకి దూకానని, పాకిస్తాన్ రేంజర్స్ తనను కాపాడారని ఆయన వివరించారు

పాకిస్తాన్ రేంజర్స్ వద్ద తాను అత్యంత సౌకర్యంగా ఉన్నానని చెప్పారు. తనను పరిచయం చేసుకున్నారని, తనకు కావాల్సినంత సహాయం చేశారని, తాను ఊహించినదాని కన్నా తనను వాళ్లు బాగా చూశారని, తనకు సంతోషంగా ఉందని 30 ఏళ్ల యాదవ్ చెప్పారు.
యాదవ్ మరో ముగ్గురు అధికారులతో అఖ్నూర్ జనరల్ ఏరియాలోని పరగ్వాల్ - ఖౌర్ సబ్ సెక్టార్‌లో గస్తీకి బయలుదేరారు. ఇరుకు మలుపు దగ్గర ప్రయాణిస్తుండగా వారి మోటార్ బోట్ ఇంజిన్ చెడిపోయిందని అధికారులు చెప్పారు. సహాయం కోసం అధికారులు ఓ పడవను పంపించారు. ముగ్గురిని వారు ఆ పడవ ద్వారా బయటకు తేగలిగారు. కానీ సత్యశీల్ యాదవ్ పడవతో పాటు పాకిస్తాన్ దేశంలోకి వెళ్లిపోయారు. సియాల్కోట్‌కు 400 మీటర్ల దూరం వెళ్లాడు. అతన్ని స్థానిక ప్రజలు బయటకు తీసి, రేంజర్స్‌కు అప్పగించారు.












Click it and Unblock the Notifications