ఉత్తరకొరియా కిమ్ అదృశ్యమైపోతే..: సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హఠాత్తుగా కనిపించకుండాపోతే మమ్మల్ని మాత్రం అడక్కండి.. అని అమెరికా నిఘా సంస్థ చీఫ్ మైక్ పొంపియో ఛలోక్తి విసిరారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో.. కిమ్ హఠాత్తు
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌పై అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన ఒక తెలివైన నటుడనీ.. అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పేర్కొంది.
అంతేకాదు, కిమ్ హఠాత్తుగా కనిపించకుండాపోతే మమ్మల్ని మాత్రం అడక్కండి.. అని అమెరికా నిఘా సంస్థ చీఫ్ మైక్ పొంపియో ఛలోక్తి విసిరారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో.. కిమ్ హఠాత్తుగా మరణిస్తే ఏం జరుగుతుంది? అనే ప్రశ్న తలెత్తింది.

సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపియోను ఒకరు ఇలా ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ...
''ఒకవేళ కిమ్ జాంగ్ అదృశ్యమైతే, సీఐఏ చరిత్రని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని అడగొద్దు. నేను దాని గురించి మాట్లాడబోను...'' అని వ్యాఖ్యానించారు.
అణుపరీక్షల పేరుతో ప్రస్తుతం అమెరికాకి ఉత్తరకొరియా కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్‌లో కిక్కిరిసిన భద్రతాధికారుల సమావేశంలో సీఐఏ చీఫ్ మాట్లాడారు.
కిమ్ అదృశ్యానికి, ప్రస్తుత పరిస్థితులకు ముడిపెడుతూ కొంతమంది ఆలోచించే అవకాశం ఉన్నందునే తానీ వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పారు. ''మీకు తెలుసా? అక్కడో యాక్సిడెంట్ జరగొచ్చు.. అది మంచిది కాదు...'' అని మైక్ పేర్కొనడంతో సమావేశంలో నవ్వులు పూశాయి.
అమెరికా నిఘా సంస్థ సీఐఏకి పలు దేశాధినేతల హత్యల్లో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్, క్యూబా, కాంగో, వియత్నాం, చిలీ వంటి దేశాధినేతల హత్యలకు కుట్రపన్నినట్టు సీఐఏకి చీకటి చరిత్ర ఉంది.
మరోవైపు కిమ్ జాంగ్‌ను చంపేందుకు సీఐఏ దక్షిణ కొరియా నిఘా సంస్థలతో కలిసి కుట్ర పన్నుతోందంటూ ఉత్తర కొరియా ఇప్పటికే ఆరోపణలు కూడా గుప్పించింది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications