Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్త తాగుబోతు, ప్రియుడు రసికుడు, రెండు రూమ్ ల్లో, భార్య స్కెచ్ రివర్స్ !

బెంగళూరు: పనిపాట చెయ్యకుండా భర్త పచ్చి తాగుబోతు అయ్యాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత భార్య ఆమె ప్రియుడితో ఎలిసి ఎంజాయ్ చేస్తోంది. పీకలదాక తాగి భర్త నిద్రపోతే పక్కరూమ్ లో భార్య ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఆకాశరామన్న సమాచారం ఇవ్వడంతో భార్య అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిసిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో భర్త దెబ్బలతో భార్యకు గంగజాతర కనపడుతోంది. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య తన భర్తను చంపేయాలని ఆమె ప్రియుడికి చెప్పింది. భర్తను చంపడానికి అతని భార్య స్వయంగా కిరాయి ఇచ్చి సుపారీ హత్య చేయించింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య నాటకాలు ఆడింది. ఎక్కడో చిన్న అనుమానం రావడంతో ఆత్మహత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ చెయ్యగా అసలు బండారం మొత్తం బయటపడింది. భార్య, ఆమె ప్రియుడి స్కెచ్ తారుమారు అయ్యింది.

 దంపతుల రామాయణం

దంపతుల రామాయణం

బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలోని విజనాపురలో లోకనాథ్, యశోధా దంపతులు నివాసం ఉంటున్నారు. లోకనాథ్ రోజు మద్యం సేవించేవాడని తెలిసింది. భార్య రోజు మద్యం సేవించి ఇంటికి రావడంతో అతనితో భార్య యశోధా గొడవపడేదని తెలిసింది. భార్య రామాయణం రోజూ ఉండేదే అంటూ లోకనాథ్ ఏమాత్రం పట్టించుకోకుండా అతను మద్యం తాగుతూనే ఉన్నాడని సమాచారం.

 ఆంటీకి లైన్ వేసిన కుర్రాడు

ఆంటీకి లైన్ వేసిన కుర్రాడు

లోకనాథ్ రోజూ పని చెయ్యకుండా టైమ్ పాస్ చేస్తూ భార్య సంపాధించే డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యం సేవించడానికి డబ్బులు ఇవ్వాలని భర్త లోకనాథ్ అతని భార్య యశోధను పీడించడం మొదలుపెట్టాడు. జోబులో డబ్బులు లేకపోతే లోకనాథ్ కు అతని భార్య గుర్తుకు వస్తోంది. లేదంటే తనకు భార్య ఉన్న విషయం లోకనాథ్ మరిచిపోయేవాడని తెలిసింది. విజనాపురలోని సెంథిల్ నగర్ లో మునిరాజు అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. యశోధా, మునిరాజు తల్లి ఫ్రెండ్స్. లోకనాథ్ వ్యసనం గురించి తెలుసుకున్న మునిరాజు యశోధ ఆంటీకి లైన్ వెయ్యడం మొదలుపెట్టాడు.

 ఒక రూమ్ లో మొగుడు...... పక్క రూమ్ లో ప్రియుడు

ఒక రూమ్ లో మొగుడు...... పక్క రూమ్ లో ప్రియుడు

భర్త లోకనాథ్ సుఖపెట్టకపోవడంతో యశోధ మునిరాజుకు దగ్గర అయ్యింది. యశోధ, మునిరాజు పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. రాత్రి భర్త ఇంటికి వచ్చినా పీకలదాక మద్యం సేవించి నిద్రపోవడంతో యశోధకు టైమ్ కలిసి వచ్చింది. అర్దరాత్రి ప్రియుడు మునిరాజును ఇంటికే పిలిపించుకుంటున్న యశోధ మరో రూమ్ లో అతనితో ఎంజాయ్ చేసి వేకువ జామును ఎవ్వరూ చూడని సమయంలో ఇంటి నుంచి బయటకు పంపిస్తోందని తెలిసింది.

 భర్తకు తెలిసింది..... రోజూ గంగజాతర

భర్తకు తెలిసింది..... రోజూ గంగజాతర

యశోధ అక్రమ సంబంధం విషయం ఆమె భర్త లోకనాథ్ కు తెలిసిపోయింది. ఇక ఆరోజు నుంచి రోజూ రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెలుతున్న లోకనాథ్ భార్య యశోధను పట్టుకుని చితకబాదుతున్నాడు. భర్త దెబ్బలతో యశోధకు గంగజాతర కనపడింది. భర్త టార్చర్ తట్టుకోలేని యశోధ అతన్ని చంపిచేస్తే పీడపోతుందని ప్లాన్ వేసింది.

 ప్రియుడు మాస్టర్ ప్లాన్

ప్రియుడు మాస్టర్ ప్లాన్

తన భర్తను చంపేయాలని, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తానని యశోధ ఆమె ప్రియుడు మునిరాజుకు చెప్పింది. కస్తూరి నగరలో నివాసం ఉంటున్న స్నేహితుడు ప్రభుతో కలిసి యశోధ ఆంటీ మొగుడిని చంపడానికి ప్రియుడు మునిరాజు స్కెచ్ వేశాడు. రాత్రి మందు పార్టీ ఇస్తున్నానని నమ్మించిన మునిరాజు ఆంటీ మొగుడు లోకనాథ్ ను ఆటో లో పిలుచుకుని వెళ్లారు. రైల్వే ట్రాక్ సమీపంలో లోకనాథ్ కు పీకలదాక మద్యం తాగించారు.

 డౌట్ రాకుండా రైల్వే ట్రాక్ స్కెచ్

డౌట్ రాకుండా రైల్వే ట్రాక్ స్కెచ్

ఆ సమయంలో మునిరాజు, ప్రభుకూడా ఎక్కువ మందు తాగినట్లు లోకనాథ్ ముందు నటించారు. పీకలదాక మద్యం సేవించిన లోకనాథ్ తలకు కిక్కు ఎక్కిపోవడంతో తూలడం మొదలుపెట్టారు. ఆ సమయంలో మునిరాజు, ప్రభు కలిసి లోకనాథ్ గొంతు నులిమి హత్య చేశారు. ఎవ్వరికి అనుమానం రాకుండా శవాన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద విసిరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. మొదట బయ్యప్పనహళ్ళి పోలీసులు లోకనాథ్ ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేశారు.

 ఈ దెబ్బలు ఎక్కడివి ? భార్య భాగోతం ఏమిటింటే

ఈ దెబ్బలు ఎక్కడివి ? భార్య భాగోతం ఏమిటింటే

లోకనాథ్ కంటి మీద, అతని చెవులు, శరీరం మీద దాడి చేసిన గాయాలు ఉండటంతో పోలీసులు లోతుగా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇదే సమయంలో యశోధా ఆంటీ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. తాను సుపారి ఇచ్చి తన భర్తను హత్య చేయించానని యశోధా అంగీకింరించిందని, ఆమెతో పాటు మునిరాజు, ప్రభును అరెస్టు చేశామని బయ్యప్పనహళ్ళి రైల్వే పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+