'ఆమె దొరకడం నా అదృష్టం'.. గర్ల్ ఫ్రెండ్ గురించి బిల్ గేట్స్ ఓపెన్

అపర కుభేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం ఒరాకిల్‌ సీఈవో మార్క్‌ హర్డ్‌ భార్య పాలాహర్డ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆయన.. ఆమె తన సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ అన్నారు. ఆమెలాంటి వ్యక్తి దొరకడం తన అదృష్టం అని వ్యాఖ్యానించారు. ఇద్దరం కలిసి టోర్నీలకు వెళ్తుంటాం.. కలిసి పనులు చేసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బిల్‌గేట్స్‌ 2021లో మెలిందా ఫ్రెంచ్‌ గేట్స్‌తో విడాకులు తీసుకున్నారు. 2019 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో పోరాడుతూ మార్క్‌ హర్డ్‌ మరణించారు. పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక 2022 నుంచి గేట్స్‌, పాలాహర్డ్‌ కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీవెడ్డింగ్‌ వేడుకలు సహా పలు ఈవెంట్స్‌లో ఇద్దరూ జంటగా దర్శనమిచ్చారు. 2024లో ఒలింపిక్స్‌ పోటీలను కూడా కలిసి వీక్షించారు. అప్పటి నుంచి వీరిద్దరూ రిలేషన్‌షిప్‌ లో ఉన్నట్టు చెబుతున్నారు.

I m lucky to find her Bill Gates opens up about his girlfriend

మరోవైపు సోర్స్‌ కోడ్‌ - మై బిగినింగ్స్‌ పేరిట బిల్ గేట్స్‌ తన జీవితం లోని కీలక అంశాలను పుస్తకంగా తీసుకువస్తున్నారు. సోర్స్‌ కోడ్‌ను మూడు పుస్తకాలుగా అందుబాటులోకి తీసుకొరానున్నారు. వాల్యూమ్‌-1లో తన చిన్ననాటి సంగతులు సహా పలు వివరాలను మాత్రమే ప్రస్తావించారు.

గేట్స్‌ చిన్నతనంలో ఆటిజంతో బాధపడేవారు. అయితే దానికి ఎలాంటి వైద్యం అందించాలో ఆయన తల్లిదండ్రులకు తెలియదని.. పలు ఆస్పత్రుల చుట్టూ తిరగడం గురించి ప్రస్తావించారు. తనని నార్మల్ గా మార్చేందుకు తన పేరెంట్స్ పడిన ఆరాటాన్ని ఈ వాల్యూమ్ లో ప్రస్తావించారు. అంతే కాకుండా యువకుడిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రయోగాలు చేశానని కూడా రాసుకొచ్చారు. అమ్మాయిల్ని ఆకట్టుకునేందుకు నిషేధిత ఎల్‌ఎస్‌డీ డ్రగ్‌ కూడా టేస్ట్ చేశానన్నారు.

ఇక తన స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఎంతగానో కలచివేసిందని బిల్ గేట్స్ వాపోయారు. తన ఉద్యోగ జీవితం, మైక్రోసాఫ్ట్‌లో ప్రయాణం.. మెలిందా గేట్స్‌తో వివాహం, సహా పలు అంశాలను భవిష్యత్‌లో విడుదల చేసే పుస్తకాల్లో వివరించనున్నట్టు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+