US Election: సర్వేల్లో దూకుడు పెంచిన ట్రంప్..!
అమెరికా ఎన్నికలు భిన్నంగా జరుగుతాయి. మొదటగా పార్టీలు ఎవరిని అధ్యక్ష బారిలో దించాలనేది నిర్ణయిస్తాయి. ఆ తర్వాత డిబేట్లు ఉంటాయి. ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో సర్వేలు కూడా చేస్తారు. సర్వే ఫలితాలు కూడా విడుదల చేస్తారు. అయితే తాజా సర్వేలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. చివరి సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ వెనక్కు నెట్టిన ట్రంప్ దూసుకెళ్తోన్నట్లు సర్వే పేర్కొంది. ట్రంప్ హారిస్ పై 1.8 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎలక్టోరల్స్ ఉంటారు. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాయి. వాటినే స్వింగ్ రాష్ట్రాలు అంటారు. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీలు ఈ స్వింగ్ స్టేట్స్ పై ఫోకస్ పెడుతుంటాయి. 2024 పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ను స్వింగ్ స్టేట్స్ భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

తాజాగా సర్వేలో స్వింగ్స్ స్టేట్స్ లో ట్రంప్ అనూహ్యంగా ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. స్వింగ్ స్టేట్స్ లో మొన్నటి వరకు కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ నవంబర్ 1న నుంచి నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ ముందుకు వచ్చారు. నెవాడాలో ట్రంప్ కు 51.4 శాతం మద్దతు.. హారిస్ 45.9 శాతం మద్దతు ఉంది. అరిజోనా స్టేట్ లో ట్రంప్ కు 51.9 శాతం సపోర్ట్ ఉంటే.. హారిస్ కు 45.1 శాతం సపోర్ట్ ఉంది. నార్త్ కరోలినాలో ట్రంప్ కు 50.4 శాతం మద్దతు ఉండగా.. హారిస్ 46.8 శాతమే మద్దతు ఉంది. జార్జియా, మిచిగాన్, నెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లో హోరాహోరీ పోరు నడుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ 'బ్లూ వాల్' రాష్ట్రాలైన మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాపై దృష్టి కేంద్రీకరించారు. హారిస్, ట్రంప్ బ్లూ వాల్ అంతటా ఉన్న యూనియన్ కార్మికుల ముందు తమ వాదనను వినిపిస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఒకరికొకరు కొన్ని మైళ్ల దూరంలో ప్రచారం చేశారు. ఇద్దరు అభ్యర్థులు వారాంతంలో పెన్సిల్వేనియాలో ప్రచారం చేశారు. వారిద్దరూ సోమవారం కీలకమైన యుద్ధభూమి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇక్కడ బిడెన్ 2020లో కేవలం 82,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు.












Click it and Unblock the Notifications