Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికా బోర్డర్లో పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతున్న భారతీయ తల్లితండ్రులు ? రీజన్ ఇదే..!

అమెరికాలో ఓవైపు భారతీయ అక్రమ వలసల్ని స్వదేశాలకు పంపుతున్నారు. మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్ధుల్ని కూడా ఎక్కడ దొరికినా బహిష్కరించేందుకు ట్రంప్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అమెరికా సరిహద్దుల్లో భారతీయ మైనర్లు పట్టుబడుతున్న ఘటనలు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. వివిధ కారణాలతో వీరు తల్లితండ్రులు, ఇతరుల తోడు లేకుండా ఒంటరిగా పట్టుబడుతున్నారు.

అమెరికాలోని మెక్సికో, కెనడా సరిహద్దుల్లో 6 నుండి 17 సంవత్సరాల వయస్సు గల భారతీయ పిల్లలు ఒంటరిగా కనిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పిల్లలు తరచుగా ఒంటరిగా, భయంతో, వారి తల్లిదండ్రులను సంప్రదించే సమాచారాన్ని కలిగి ఉన్న కాగితం ముక్కతో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా -మెక్సికో సరిహద్దు వద్ద చాలా మంది మైనర్లు వ్యూహాత్మకంగా వదిలివేయబడినట్లు అధికారులు గుర్తించారు. అయితే కెనడా సరిహద్దుల్లో మాత్రం వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం అక్కడి సరిహద్దుల్లో కఠిన పరిస్దితులే.

Increase in Indian minors abandonment incidents at US borders with Canada and mexico

అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 77 మంది ఇలా ఒంటరిగా కనిపించిన భారతీయ మైనర్లను అరెస్టు చేశారు. మెక్సికో సరిహద్దు వద్ద 53 మంది, కెనడా సరిహద్దు వద్ద 22 మంది, మరికొందరిని అమెరికాలో గుర్తించారు. 2022లో ఇలా 409 భారతీయ మైనర్లు దొరికారు. 2023లో ఈ సంఖ్య 730కి చేరింది. 2024 నాటికి మాత్రం 517 మందికి తగ్గింది. 2025లో ఇప్పటివరకూ 77 మంది మైనర్లు ఇలా దొరికారట. 2020లో కరోనా సమయంలో మాత్రం 219 మంది ఇలా దొరికారట.

Increase in Indian minors abandonment incidents at US borders with Canada and mexico

2021లోనూ కేవలం 237 మంది మైనర్లు ఇలా పట్టుబడ్డారు. కోవిడ్ తర్వాత అక్రమ వలసలు పెరగడంతో ఇలా దొరికే మైనర్ల సంఖ్య కూడా పెరుగుతోందని గుర్తించారు. మైనర్లకు అనుకూలంగా ఉండే చట్టపరమైన లొసుగుల ద్వారా అమెరికా నివాసాన్ని పొందే అవకాశాలను మెరుగుపరచడానికి కుటుంబాలు ఉద్దేశపూర్వకంగా పిల్లలను ఒంటరిగా పంపుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అమెరికాలో అక్రమంగా చొరబడే సమయంలో పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇలా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+