భారత్ తో సంబంధాలు కావాలంటే.. టర్కీకి కేంద్రం పాక్ కండిషన్..!
కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మధ్యలోనే నిలిచిపోయినా, భారత్ పై దాడులకు దిగిన పాకిస్తాన్ కు టర్కీ డ్రోన్లు పంపి సహకరించినా అంతిమంగా అంతర్జాతీయ సమాజం ముందు మన వాదనే నెగ్గింది. ఈ నేపథ్యంలో పాక్ కు సహకరించిన టర్కీకే ఇవాళ కేంద్రం ఓ సందేశాన్ని పంపింది. ముఖ్యంగా తాము మిత్రదేశంగా భావిస్తున్న పాకిస్తాన్ కు ఈ సందేశం అందించాలని సూచించింది.
టర్కీని ఉద్దేశించి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఇవాళ మాట్లాడారు. టర్కీ మిత్రదేశంగా భావిస్తున్న పాకిస్తాన్ కు అది రెచ్చగొడుతున్న సీమాంతర ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఓ సాధనంగా వాడుకోకుండా అడ్డుకోవాలని సూచించారు. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆశ్రయిస్తున్న ఉగ్రవాద వ్యవస్థపై విశ్వసనీయమైన, ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని టర్కీని కోరారు.

VIDEO | "We expect Türkiye to strongly urge Pakistan to end its support to cross-border terrorism, take credible and verifiable action against the terror ecosystem it has harboured for decades now," said MEA spokesperson Randhir Jaiswal (@MEAIndia) earlier today.
— Press Trust of India (@PTI_News) May 22, 2025
(Full video… pic.twitter.com/VBaMg8e4Gg
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత టర్కీ.. పాకిస్తాన్ వైపు మొగ్గు చూపిన తర్వాత భారత్-టర్కీ సంబంధాలు దెబ్బతిన్నాయి. టర్కీ వస్తువులు బహిష్కరించాలని, టర్కీతో అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ టర్కీతో సంబంధాలపైనా స్పందించింది. తమ సంబంధాలు దెబ్బతిన్నందున, రెండు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, పరస్పర ఆందోళనల సున్నితత్వంపై ఆధారపడ్డాయని తెలిపింది. కాబట్టి తమతో సంబంధాలు కావాలంటే తమ శత్రువైన పాకిస్తాన్ ను ఉగ్రవాదం వీడేలా ఒప్పించాలని కేంద్రం కోరింది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా టర్కీ పంపిన వందలాది డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు విఫలయత్నం చేసింది. అయితే భారత్ వాటిని ఎక్కడికక్కడ కూల్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో టర్కీతో భారత్ లోని పలు విశ్వవిద్యాలయాలు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని అర్దాంతరంగా రద్దు చేసుకున్నాయి. అంతే కాదు ఎయిర్ పోర్టుల్లోనూ టర్కీ నిర్వహణ కాంట్రాక్టులను కూడా కేంద్రం రద్దు చేసేసింది. అయితే ఇవాళ ఉన్నట్లుండి టర్కీ ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications