వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై భారత్ ఘన విజయం: అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ నవ్వులపాలు: ఆ దేశాల మద్దతు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ భారత్‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా.. ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ వేదికల మీద అభాసుపాలవుతోంది. మెజారిటీ దేశాలు ఆసియాలో అత్యంత శక్తిమంతమైన చైనాను కాదని.. భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయనే విషయం మరోసారి రుజువైంది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా తాము భారత్‌కే మద్దతు ఇస్తామనే అంశాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

Recommended Video

India - China : అంతర్జాతీయ వేదికపై నవ్వులపాలైన China.. చైనాపై భారత్ ఘన విజయం!! || Oneindia Telugu

జపాన్ కొత్త ప్రధాని ఎవరంటే?: పేద రైతు కుటుంబం నుంచి ప్రధానిగా: అట్టపెట్టెల కంపెనీలో లేబర్‌గాజపాన్ కొత్త ప్రధాని ఎవరంటే?: పేద రైతు కుటుంబం నుంచి ప్రధానిగా: అట్టపెట్టెల కంపెనీలో లేబర్‌గా

 సరిహద్దు వివాదాల మధ్య..

సరిహద్దు వివాదాల మధ్య..

ఐక్యారాజ్యసమితి వేదికగా నిర్వహించిన ఓ ఎన్నికలో భారత్ ఘన విజయాన్ని సాధించింది. సభ్యత్వాన్ని సాధించింది. తనతో పోటీ పడిన చైనాను ఓడించింది. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్.. ఐక్యరాజ్యసమితి వేదికగా చైనాను ఓడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఓ గవర్నింగ్ బాడీలో సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో చైనాను కాదని భారత్‌కే ఓటు వేశాయి మిగిలిన దేశాలు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. చివరికి ఆఫ్గనిస్తాన్ కూడా విజయం సాధించింది గానీ.. చైనాకు ఆ అదృష్టం దక్కలేదు.

ఐరాసలో కీలక కౌన్సిల్ ఎన్నికలో..

ఐరాసలో కీలక కౌన్సిల్ ఎన్నికలో..

ఐక్యరాజ్యసమితిలోని కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్‌ విభాగంలో పనిచేసే ఎకనమిక్ అండ్ సోషియల్ కౌన్సిల్ (ఎకొసొక్) సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికలో భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడ్డాయి. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ఈ ఎన్నికలో 54 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ ఓటుహక్కును వినియోగించకున్నారు. ఈ కౌన్సిల్‌లో సభ్యత్వం దక్కాలంటే 28 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో ఆఫ్ఘనిస్తాన్-39, భారత్-38 ఓట్లు పోల్ అయ్యాయి. చైనాకు మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. ఆ దేశానికి 27 ఓట్లు పడ్డాయి. ఈ రెండు దేశాలకూ ఎకొసొక్‌లో సభ్యత్వం లభించింది. చైనా ఓటమి పాలైంది.

ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి వెల్లడి..

ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ కౌన్సిల్‌లో భారత్.. నాలుగేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. మళ్లీ నాలుగేళ్ల తరువాత భారత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దు వివాదాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ చూపుతోన్న సంయమనం, శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి చేస్తోన్న ప్రయత్నాలు ఆయా దేశాలను ఆకట్టుకున్నాయని అంటున్నారు.

బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్ పాతికేళ్లు

బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్ పాతికేళ్లు

మహిళలకు సమానత్వం అంశంపై చైనా 1995లో బీజింగ్‌లో నిర్వహించిన వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్ సదస్సు ముగిసి బుధవారం నాటికి సరిగ్గా 25 సంవత్సరాలవుతుంది. 1995 సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ అంతర్జాతీయ సదస్సును చైనా నిర్వహించింది. సరిగ్గా అదే రోజు నాటికి.. మహిళలపై ఐక్యరాజ్యసమితిలోని కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ విమెన్‌‌ విభాగంలోని ఎకనమిక్ అండ్ సోషియల్ కౌన్సిల్ ఎన్నికలో చైనా ఓటమిపాలు కావడం యాదృచ్ఛికమే కావచ్చు.

English summary
India has been elected as a member of the United Nation's Commission on Status of Women, a body of the Economic and Social Council (ECOSOC), said TS Tirumurti, permanent representative of India to the United Nations, on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X