వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్ జ‌వ‌హ‌రీని హ‌త‌మార్చిన ఆయుధం కొనుగోలుకు భార‌త్ ఆస‌క్తి

|
Google Oneindia TeluguNews

అల్‌ఖైదా చీఫ్ అల్‌జ‌వ‌హ‌రీని హ‌త‌మార్చ‌డంలో ''ఎంక్యూ-9 రీప‌ర్'' అనే స‌రికొత్త డ్రోన్ ప్ర‌ధాన పాత్ర పోషించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడు ఈ వాహ‌నంపై దృష్టిసారించాయి. జ‌వ‌హ‌రీని నుజ్జు నుజ్జు చేసి చంపేందుకు అగ్ర‌రాజ్యానికి చెందిన అధికారులు అత్యంత క‌చ్చిత‌త్వంతో ల‌క్ష్యాన్ని ఛేదించే ఆర్ఎక్స్ 9 క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది. దాన్ని ప్రిడేట‌ర్ బి డ్రోన్‌గా పిలుస్తారు. ఎంక్యూ 9 రీప‌ర్‌, మ‌నీవెల్ టీపీసీ 331-10 ట‌ర్బో ప్రొప్ అనే ఇంజ‌న్ సాయంతో ఇది ప‌నిచేస్తుంది.

ఏకధాటిగా 34 గంటలు ఆకాశంలో..

ఏకధాటిగా 34 గంటలు ఆకాశంలో..

దీనికి డిజిట‌ల్ ఎల‌క్ట్రానిక్ ఇంజ‌న్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను జ‌త‌చేర్చారు. దీంతో ఇంజ‌న్ సామ‌ర్థ్యం గ‌ణ‌నీయంగా ఉంటుంది. త‌క్కువ ఎత్తులో ప్ర‌యాణించేట‌ప్పుడు ఇంధ‌నం వృథా కాకుండా ఉంటుంది. రీప‌ర్ లో పేలోడ్ ల‌ను మోసుకెళ్లేందుకు 7 ఎక్స్ ట‌ర్న‌ల్ స్టేష‌న్లు ఉంటాయి. ఏక‌ధాటిగా 27 గంట‌ల పాటు ఆకాశంలో ఉండ‌గ‌ల‌దు. దాడుల‌తోపాటు నిఘాకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీన్ని ఆప‌రేట్ చేయ‌డం చాలా సులువు. ప్రిడేట‌ర్ బికి మ‌రిన్ని హంగులు జోడించ‌డంద్వారా అత్యాధునిక ప్రిడేట‌ర్ బీ ఈఆర్ డ్రోన్ల‌ను ఇప్ప‌టికే త‌యారు చేశారు. కొత్త‌వి ఆకాశంలో ఏకధాటిగా 34 గంట‌ల‌పాటు ఉంటాయి.

 ''ఎంక్యూ-9 రీప‌ర్'' ప్రత్యేకతలు

''ఎంక్యూ-9 రీప‌ర్'' ప్రత్యేకతలు


36 అడుగుల పొడ‌వు
12.5 అడుగుల ఎత్తు
66 అడుగుల వెడ‌ల్పు
2223 కిలోల బ‌రువు
240 నాట్ల వేగం
1150 మైళ్ల ప‌రిధి
50వేల అడుగుల ఎత్తుకు వెళ్ల‌డం
1746 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్ల‌గలదు.

నాలుగు దేశాల దగ్గర ఈ ఆయుధాలు

నాలుగు దేశాల దగ్గర ఈ ఆయుధాలు

అమెరికా, ఫ్రాన్స్, బ్రిట‌న్‌, స్పెయిన్‌, ఇట‌లీ ద‌గ్గ‌రే ఈ త‌ర‌హా ఆయుధాలున్నాయి. భార‌త్ కూడా వీటి కొనుగోలుకు ఆస‌క్తిగా ఉంది. 60 నుంచి 80 మిలియన్ డాలర్ల ఖరీదైన ఈ రీపర్ కొనుగోలుకు ఇప్పటికే భారత్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ధర విషయంలో స్పష్టత రాగానే ఒప్పందానికి సంతకాలు జరుగుతాయని విదేశీ వ్యవహారాలశాఖ నిపుణులు వెల్లడించారు. అల్ ఖైదా చీఫ్ జవహరీని హతమార్చడం భారత్ కు ముఖ్యమైన అంశం. భారత్ పై ఉగ్రదాడులకు పాల్పడే పలు సంస్థలకు కూడా తాలిబన్లు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఎవరికీ ఆశ్రయం ఇవ్వకుండా ఉండాలంటే జవహరీని హతమార్చడం సరైన చర్యగా భారత్ అధికారులు అభిప్రాయపడ్డారు.

English summary
India is also interested in buying these. Negotiations have already been held between India and America for the purchase of this reaper, which costs 60 to 80 million dollars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X