
తాలిబన్ విజయం: భారత్ నిర్ణయంలో మార్పు! -అఫ్గాన్ సంక్షోభంపై రామ్ మాధవ్ వ్యాఖ్యలు -చైనా మద్దతు?
దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఒక్కొక్కటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వచ్చిన తాలిబన్ సేనలు ఆదివారం నాటికి రాజధాని కాబూల్ ను సైతం హస్తగతం చేసుకున్నాయి. తాలిబన్లతో పోరాడకుండానే, కాబూల్ నగరంలో రక్తపాతం లేకుండానే అధికార పగ్గాలను అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామంటూ అష్రఫ్ ఘని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పరిణామం భారత్ ను ఎలా ప్రభావితం చేస్తుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే..
తాలిబన్ల
ఘన
విజయం:
కాబూల్
వశం
-అఫ్గాన్‌లో
ప్రభుత్వ
ఏర్పాటు
-ఘని
రాజీనామా
-కొత్త
అధ్యక్షుడు
బరాదర్
మోదీ
సర్కారుపై
సీజేఐ
రమణ
సంచలన
వ్యాఖ్యలు
-ఏ
చట్టం
ఎందుకో
తెలియట్లే
-పార్లమెంట్
తీరుపై
తీవ్ర
ఆవేదన

తాలిబన్లపై ఆర్ఎస్ఎస్..
బీజేపీ మాజీ నేత, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కీలక నేత రామ్ మాధవ్ అఫ్గాన్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ లో పరిపాలన తాలిబన్ల వశమైపోయిన నేపథ్యంలో, ఆ దేశం పట్ల భారత్ అనుసరిస్తోన్న వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలని రామ్ మాధవ్ అన్నారు. తాలిబన్ అధికార ప్రతినిధి సుహయిల్ షహీన్ చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఆర్ఎస్ఎస్ నేత ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల విజయం, రాజధాని కాబూల్‌ను సైతం వారు స్వాధీనం చేసుకున్న నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, ''ఈ పరిణామాలను భారత్ నిరోధించలేకపోయినా, వాటి వల్ల భారత్ ప్రయోజనాలపై కలిగే ప్రతికూల ప్రభావాన్ని నిరోధించడానికి మనం సిద్ధం కావాలి''అని రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. తద్వారా అఫ్గాన్ పై వైఖరిని తొందరగా మార్చుకోవాలని మోదీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ నిర్దేశించినట్లయింది. కాగా,

గుర్తించబోమన్న భారత్..
తుపాకి ద్వారా చేపట్టిన అధికారాన్ని భారత్ గుర్తించబోదంటూ రెండ్రోజుల కిందట విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. అయితే, ఒక్క తుపాకి గుండు పేలకుండానే అఫ్గాన్ లో అధికార మార్పిడి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిందిప్పుడు. కాబూల్ సిటీలో సైన్యానికి, తాలిబన్ మూకలకు మధ్య హోరాహోరి పోరు తప్పదని అంతా భావించినా, అందుకు విరుద్ధంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే కాబూల్ సిటీ తాలిబన్ల వశమైపోయింది. కాబూల్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన తాలిబన్ సేనలు.. మధ్యవర్తిత్వ బృందాన్ని అధ్యక్ష భవనానికి పంపగా, ఆ వెంటనే అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘని రాజీనామా చేశారనే ప్రకటన వెలువడింది. దీంతో తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అఫ్గాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నియమితులైనట్లు కూడా ప్రకటన వెలువడింది. అయితే,

అంతర్జాతీయ మద్దతు కోసం..
అఫ్గానిస్థాన్ లో అధ్యక్షుడు అష్రఫ్ ఘని రాజీనామా తర్వాత పరిస్థితులు ఆసక్తికర మలుపు తిరిగాయి. రక్తపాతం లేకుండానే దేశం తమ వైశమైపోయింది కనుక, దీన్ని ప్రజాప్రభుత్వంగా గుర్తించాలనే వాదనను తాలిబన్లు బలంగా వినిపిస్తున్నారు. దోహా వేదికగా జరుగుతోన్న చర్చల ద్వారానే అధికార మార్పిడికి రంగం సిద్ధం చేస్తున్నారు. తాలిబన్లకు అధికారాన్ని అప్పగించడంపై ఆఫ్ఘనిస్థాన్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో చర్చలు జరిగినా, దాన్ని అంతర్జాతీయ సమాజం చేతా గుర్తింపు తెచ్చుకోవాలని తాలిబన్లు ఆరాటపడుతున్నారు. అధికారం దక్కిన తర్వాత తాలిబన్ కీలక నేతలంతా ఇప్పుడు అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే, తాలిబన్ సేనలను వెనక్కి తగ్గాలని, కాబూల్ లోకి చొరబడొద్దనీ ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి,

అఫ్గాన్ కు అసలు సైన్యమే లేదా?
రెండు దశాబ్దాల యుద్ధం తర్వాత అమెరికా, నాటో సేనలు అఫ్గానిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలిగిన నెల రోజుల్లోనే ఆ దేశం పూర్తిగా తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయింది. అఫ్గాన్ సైన్యం నుంచి నామమాత్రంగానైనా ప్రతిఘటన లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. తద్వారా అప్గాన్ సైన్యం విషయంలో అమెరికా చెప్పిన, ప్రచారం చేసిన విషయాలన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. తాజా నివేదిక ప్రకారం.. అఫ్గాన్ సేనలు సంఖ్య రికార్డుల్లో కనిపించిన దానికంటే తక్కువని తెలుస్తోంది. సైనిక దస్త్రాల్లో కనిపించిన పేర్లు వాస్తవానికి నకిలీవని, ఆ పేర్లున్న వ్యక్తులెవరూ సైన్యంలో పనిచేయలేదని తెలుస్తోంది. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు కమాండర్లు ఈ విధానంలో తమ జేబులు నింపుకున్నారట. దీని ఫలితంగా ఉన్న కొద్ది మంది సేనల్లో యుద్ధసన్నద్ధత, నైతికస్థైర్యం దెబ్బతిన్నాయి. తాలిబన్లతో యుద్ధం చేస్తున్న సైనికులకు వ్యవస్థాగత మద్దతు కొరవడిందని..కొన్ని సందర్భాల్లో సమయానికి ఆహారం కూడా అందక వారు ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది.
Recommended Video

తాలిబన్లకు పాక్, చైనా మద్దతు, మరి ఇండియా..
అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం కావడానికి భారత్ దాయాది పాకిస్తాన్ అన్ని రకాలుగా మద్దతు ఇచ్చింది. తాలిబన్‌లు గతంలో ఓడిపోయినా ఆ సంస్థను చురుకుగా ఉంచడంలో పాకిస్థాన్‌దే కీలక భూమిక. పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో వీరికి ఆయుధాలతో పాటు శిక్షణ 2001 నుంచి ఇప్పటివరకూ కొనసాగింది. పాక్‌కు చెందిన వేలాది ఉగ్రవాదులు అఫ్గాన్ పౌరప్రభుత్వంపై జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. దీంతో వారికి ఎదురులేకుండాపోయింది. అటు డ్రాగన్ చైనా కూడా తాలిబన్లకు మద్దతిస్తున్నట్లు, తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వాన్ని గుర్తించవచ్చనే వార్తల నడుమ ఈ పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. పైగా, అఫ్గాన్ రాజకీయాల్లో భారత్ గనుక సైనిక జోక్యానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని తాలిబన్ అధికార ప్రతినిధులు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గాన్ లో అధికార మార్పిడిని సుస్థిరం చేసుకునే దిశగా తాలిబన్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దోహా వేదికగా జరుగుతోన్న చర్చలకు కొనసాగింపుగానే, అంతర్జాతీయ జోక్యంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబన్ నేతలు భావిస్తున్నారు. ఈ దశలో భారత్ తన వైఖరిని మార్చుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పడం కీలకంగా