స్వీట్లు పంచుకున్న భారత్, పాక్: మోడీ శుభాకాంక్షలు

India-Pakistan border guards exchange sweets on Eid
న్యూఢిల్లీ: రంజాన్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ బార్డర్ వద్ద గార్డ్స్ మిఠాయిలు పంచుకున్నారు. అమృత్‌సర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే అట్టారీ - వాఘా చెక్ పోస్టు వద్ద పాకిస్తాన్, భారత్ జవాన్లు రంజాన్ సందర్భంగా మిఠాయిలు పంచుకొని, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు భారత సైనికులకు మిఠాయిలు ఇచ్చారు.

వందలాది మంది ముస్లింలు చండీగఢ్, ఇతర మసీదులలో ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక మక్కా మసీదులో ముస్లీం సోదరులు ప్రార్థనలు చేశారు. ఈ రోజుతో రంజాన్ మాసం ముగుస్తోంది.

మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటికి వెళ్లి ఆయనకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలీ నివాసానికి కేసీఆర్‌తో పాటు మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావు, ఎంపీలు కవిత, కేకేలు హాజరయ్యారు.

మోడీ శుభాకాంక్షలు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రోజు ప్రజల మధ్య శాంతిని, సోదరభావాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించాలని కోరుకుంటున్నట్టు ట్లిట్టర్లో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+