వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొమినికాకు చిక్కిన మెహుల్‌ ఛోక్సీ-అప్పగింతకు రెడీ-భారత్‌ టీకా సాయానికి ప్రతిగా

|
Google Oneindia TeluguNews

గతంలో కరోనా సెకండ్‌ వేవ్ రాకముందు భారత్‌లో వ్యాక్సిన్‌ వేయించుకునే వారే కరువయ్యారు. దీంతో అప్పుడే తయారైన వ్యాక్సిన్‌ను ఏం చేయోలో తెలియక మోడీ సర్కార్ అదే పనిగా విదేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. అదీ వ్యాక్సిన్ దౌత్యం పేరుతో ఉచితంగానే పంచేసింది. దీనిపై ఎవరెన్ని విమర్శలు చేసిన మోడీ సర్కార్ మాత్రం వెనక్కితగ్గలేదు. ఇప్పుడు అదే సాయం అక్కరకొచ్చేలా కనిపిస్తోంది.

సీన్‌ కట్‌ చేస్తే పంజాబ్‌ నేషనల్ బ్యాంక్ స్కాం ప్రధాన నిందితుల్లో ఒకడైన మెహుల్‌ ఛోక్సీ భారత్‌ నుంచి పారిపోయి కరీబియన్ దీవుల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే ఛోక్సీ కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా నుంచి కూడా తప్పించుకుని పారిపోయాడు. ఎలా పారిపోయాడో కూడా తెలియకుండా తప్పించుకున్నాడు. చివరికి ఇదే దీవుల్లోని డొమినికాకు చేరాడు. అక్కడ కొంతకాలం సేఫ్‌గా ఉండాలనుకున్నాడు.

India’s donation of Covid jabs to Dominica may help bring back Mehul Choksi

కానీ ఛోక్సీకి తెలియనిది ఏంటంటే ఆ డొమినికా భారత్‌కు మిత్రదేశమని ..తాజాగా డొమినికా పోలీసులు మెహుల్‌ ఛోక్సీని అరెస్టు చేశారు. అంతేకాదు భారత్‌తో ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం మన దేశానికి అప్పగించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో డొమినికా పోలీసుల చేతిలోఉన్న ఛోక్సీని ముచ్చెమటలు పడుతున్నాయట. ఈ విషయాన్ని ఇంటర్‌పోల్ తాజాగా భారత్‌కు తెలియజేసింది. దీంతో ప్రధాని మోడీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ నేరుగా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఛోక్సీని భారత్‌ రప్పించేందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Recommended Video

New IT Rules : Facebook తగ్గినా WhatsApp Court Plea | Indian Government || Oneindia Telugu

English summary
India's donation of Covid jabs to Dominica may help the government in bringing back fugitive businessman Mehul Choksi to the country. Mehul Choksi has been detained in Dominica, a Caribbean Island nation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X