వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు చుక్కెదురు?: మిలటరీ బేస్ ఒప్పందానికి ఒప్పుకోని సీషెల్స్ ప్రతిపక్షం..

|
Google Oneindia TeluguNews

విక్టోరియా, సీషెల్స్: హిందూ మహాసముద్ర తీరం వెంబడి చైనా సాగిస్తున్న ఆధిపత్యాన్ని నియంత్రించడానికి.. సీషెల్స్ లాంటి దేశాల్లోనూ మిలటరీ బేస్ ఏర్పాటు చేయాలని భారత్ గతంలోనే నిర్ణయించింది. దీనిపై ఆ దేశంతో 2015లో ఒప్పందం కూడా జరిగింది. అయితే ఈ ఒప్పందానికి సీషెల్స్ ప్రతిపక్ష పార్టీ మాత్రం అంగీకరించడం లేదు.

హిందూ మహాసముద్ర దీవుల్లోని ఒక ద్వీపంలో భారత్ మిలటరీ బేస్ ఏర్పాటు చేయాలని భావించగా.. సీషెల్స్ పార్లమెంటు మంగళవారం దానిపై ప్రతికూలంగా స్పందించింది. భారత్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి ఆమోదం తెలపడం లేదని స్పష్టం చేసింది.

Indias Plan To Open Military Base In Indian Ocean Island Runs Aground

కాగా, మిలటరీ బేస్ ఏర్పాటు కోసం భారత్ 550మిలియన్ డాలర్లు వెచ్చించడానికి సిద్దపడింది. సీషెల్స్ నైరుతీ తీరం నుంచి విక్టోరియా వరకు విస్తరించి ఉన్న 1.135కి.మీ తీరం వెంబడి ఈ మిలటరీ కార్యకలాపాలు జరగాల్సి ఉంది. సీషెల్స్ దళాలకు సైనిక శిక్షణ ఇచ్చేందుకు భారత్ తమ సైనికులను కూడా ఇక్కడ మోహరించింది.

మిలటరీ బేస్ కి సంబంధించి భారత్-సీషెల్స్ ప్రభుత్వ ఒప్పందానికి స్థానికుల నుంచి ప్రతిఘటన వ్యక్తమైంది. ప్రతిపక్ష లిన్‌యోన్ డెమోక్రటిక్ సెసెల్వ పార్టీ అధినేత రాంకలవాన్ కూడా ఇందుకు అంగీకరించకపోగా.. ఈ ఒప్పందం ఒక ఇక లేనట్టే అని కామెంట్ చేశారు.

కాగా, లిన్‌యోన్ డెమోక్రటిక్ సెసెల్వ పార్టీకి అక్కడి పార్లమెంటులో మెజారిటీ ఉండటంతో.. వారి ఆమోదం లేకుండా ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడం కష్టం. ప్రతిపక్ష పార్టీ వాదనపై స్పందించిన అధ్యక్షుడు డానీ మాత్రం.. ఈ విషయమై లిన్‌యోన్ డెమోక్రటిక్ అధినేతతో మాట్లాడుతానని అన్నారు. మార్చి 26న ఆయనతో చర్చలు జరపనున్నట్టు తెలిపారు.

సీషెల్స్-భారత్ మధ్య 2015లో ఈ ఒప్పందం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో దీనిపై తుది నిర్ణయం జరిగింది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే.. 1.3మిలియన్ స్క్వేర్ కి.మీ తీరం వెంబడి పెట్రోలింగ్ నిర్వహించే కోస్ట్ గార్డులకు ఉపకరిస్తుందని అన్నారు. తద్వారా అక్రమ చేపల వేట, డ్రగ్స్ రవాణా, పైరసీ వంటి వాటిని అరికట్టవచ్చునని చెబుతోంది.

English summary
Seychelles' opposition coalition, which holds a majority in parliament, said Tuesday it would not ratify a deal signed with India to build a military base on one of the archipelago's outlying islands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X