వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రుత్వం వీడి, కలిసి రావాలి: భారత్‌కు పాక్ ఆర్మీ కమాండర్

పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ భారత దేశానికి స్నేహ సందేశం పంపించారు. ఇరు దేశాలు శతృత్వం వీడి ఆర్థిక అభివృద్ధికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ భారత దేశానికి స్నేహ సందేశం పంపించారు. ఇరు దేశాలు శతృత్వం వీడి ఆర్థిక అభివృద్ధికి కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఆర్మీ సదరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ రియాజ్ బుధవారం క్వెట్టాలోని బెలూచిస్తాన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా చేపడుతున్న ఎకనామిక్ కారిడార్‌లో భారత్ కూడా భాగస్వామ్యం కావాలన్నారు. బెలూచిస్తాన్ బాగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. స్వీయ నిర్బంధంలో ఉన్న నేతల మాటలతో ప్రజలు తప్పుదారి పట్టవద్దన్నారు.

pakistan

బెలూచిస్తాన్ అభివృద్ధిని శత్రుదేశాలు గుర్తించలేకపోతున్నాయన్నారు. పాకిస్తాన్, చైనా కారిడార్‌లో భారత్‌తో పాటు ఆప్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా దేశాలు పాల్గొనాలన్నారు. ఆ ఫలాలు అందరికీ దక్కేలా చూడాలన్నారు. పాక్ వ్యతిరేక కార్యక్రమాలను పక్కన పెట్టడం ద్వారా భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, వాటి ఫలాలు అందుకోవాలన్నారు.

English summary
A Pakistani army commander has asked India to be part of the China-Pakistan Economic Corridor on Wednesday as he asked New Delhi to stop “subversive anti-Pakistan activities” and take advantage of the multi-billion dollar project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X