భారత్ చైనాలో కలుస్తుందని..: 'ఇండియా టుడే' కవర్ ఫోటోపై చైనాలో రచ్చ
భారత్‌కు చెందిన ప్రముఖ మేగజైన్ ఇండియా టుడే కవర్ పేజీపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ సోషల్ మీడియా వైబో వేదికగా ఇండియా టుడేపై మండిపడుతున్నారు.
బీజింగ్: భారత్‌కు చెందిన ప్రముఖ మేగజైన్ ఇండియా టుడే కవర్ పేజీపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ సోషల్ మీడియా వైబో వేదికగా ఇండియా టుడేపై మండిపడుతున్నారు.

చైనాస్ న్యూ చిక్ పేరుతో కథనం
ఇండియా టుడే పత్రిక కవర్ పేజీపై ప్రచురించిన చైనా, పాకిస్తాన్ జాతీయ పతాకాలు ఇందుకు కారణం. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చైనాస్ న్యూ చిక్ పేరుతో కవర్ పేజీ కథనం ప్రచురించింది ఇండియా టుడే.

చైనాను కోడిలా, పాక్‌ను కోడిపిల్లలా
ఇందుకు ఓ ఫోటోను పెట్టింది. చైనా పటాన్ని కోడిలా, పాక్ పటాన్ని కోడిపిల్లలా అందులో చూపించింది. దీనిపై చైనాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తమను కోడిలా చూపించినందుకు కాకుండా.. చైనా పటంలో టిబెట్, తైవాన్‌లు లేవంటూ మండిపడుతున్నారు.

ఇండియా చైనా పటంలో కలుస్తుందని
ముందు మీరు చైనా భూభాగం ఎంతో తెలుసుకోవాలని చైనీయులు కామెంట్లు పెట్టారు. త్వరలోనే ఇండియా కూడా చైనా పటంలో కలుస్తుందని కొందరు హద్దు మీరి మాట్లాడారు.

చైనా తగ్గాలని ఇండియా టుడే, తైవాన్ సంబరం
ఈ వివాదంపై ఇండియా టుడే స్పందించింది. చైనీయులు తగ్గాలని, న్యూయార్క్‌కు చెందిన ది సొసైటీ ఆఫ్ పబ్లికేషన్స్ డిజైనర్స్ ఈ ఫోటోను ఫోటో ఆప్ ది డేగా గుర్తించిందని పేర్కొంది. కాగా, ఈ ఫోటోపై తైవాన్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలైన చైనా పటం ఇదేనని కామెంట్లు పెడుతున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications