అంతర్జాతీయ వేదికపై భారత్ అరుదైన ఘనత.. ఏడోసారి ఏకగ్రీవంగా !

అంతర్జాతీయ వేదికపై భారత్ మరో ఘన విజయాన్ని సాధించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UN Human Rights Council) సభ్య దేశంగా భారత్ ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026 నుంచి 2028 వరకు మూడేళ్లపాటు ఈ ప్రతిష్టాత్మక పదవిలో భారత్ కొనసాగనుంది. ఈ ఎన్నికలు అమెరికా న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించారు. దీనిపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ విషెస్ తెలియజేస్తున్నారు.

భారత్‌కు ఐక్యరాజ్యసమితి గుర్తింపు..

భారత్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఆర్థిక సామాజిక మండలి, మహిళా సాధికారత కమిషన్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మానవ హక్కుల మండలిలో కూడా మళ్లీ సభ్యత్వం దక్కించుకోవడం భారత్‌ దౌత్యరంగంలో మరో మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పి. ఆనందం వ్యక్తం చేశారు.

india-unanimously-elected-as-member-of-the-uno-human-rights-council

ఆయన మాట్లాడుతూ.. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణ పట్ల భారత్‌కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ విజయం ప్రతీకని కొనియాడారు. ప్రపంచ దేశాలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వడం, భారత్‌పై వాటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో భారత్‌కు మద్దతు తెలిపిన అన్ని సభ్య దేశాలకు హరీశ్ పి. ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీకాలంలో మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం.. సహా పలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

కాగా మానవ హక్కుల మండలి (UNHRC) ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనలను పర్యవేక్షణతో పాటు పరిశీలనలు, సలహాలు ఇచ్చే కీలక వేదికగా నిలుస్తోంది. ఇది 47 సభ్య దేశాలతో ఏర్పడగా.. ప్రతి సంవత్సరం జెనీవాలో సమావేశమై మానవ హక్కుల పరిస్థితిపై నివేదికలను సమీక్షిస్తుంది.

భారత్ ఇటీవల G20 సదస్సును విజయవంతంగా నిర్వహించి ప్రపంచ నాయకత్వాన్ని చాటుకుంది. వాతావరణ మార్పులు, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత, డిజిటల్ సమానత్వం వంటి రంగాల్లో భారత్ చేస్తున్న కృషి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+