India-US Trade Deal: భారత్ -అమెరికా ట్రేడ్ డీల్ పై ట్రంప్ దూత కీలక ప్రకటన..!

భారత్-అమెరికా మధ్య ఎప్పటి నుంచో ఊరిస్తున్న వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) ఖరారు తుది దశకు చేరింది. ఈ మేరకు ట్రంప్ దూతగా భారత్ వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత్, అమెరికా చాలా చాలా దగ్గరగా ఉన్నాయని రూబియో వెల్లడించారు. ప్రస్తుతం తన రెండవ అధికారిక భారత పర్యటనలో ఉన్న రూబియో, త్వరలోనే ఈ ఒప్పందం ఖరారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

H-1B షాకులతో అమెరికా వెళ్లేందుకు మిగిలిన రెండు దారులివే..! అర్హతలివే..!
H-1B షాకులతో అమెరికా వెళ్లేందుకు మిగిలిన రెండు దారులివే..! అర్హతలివే..!

ముంబైలో ఇంధన భద్రత, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించేందుకు నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రూబియా మాట్లాడుతూ.. విదేశాంగ శాఖ వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపదని, కానీ తాజా పరిణామాల్లో తాము చాలా చురుకుగా పాల్గొంటున్నామన్నారు. తాము చాలా చాలా దగ్గరగా ఉన్నామన్నారు. ఒప్పందంపై సంతకాలు చేయకుండానే సాధ్యమైనంత దగ్గరగా ఉన్నామని తాను చెప్పగలనన్నారు. పూర్తి చేయాల్సిన కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తాను భావిస్తున్నానట్లు వెల్లడించారు. కాబట్టి అది త్వరలోనే జరుగుతుందని అనుకుంటున్నానన్నారు.

India-US Trade Deal Near Finalisation Only Few Issues Left to Resolve Marco Rubio
ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!
ట్రంప్ కు ఢిల్లీ నిరసనలసెగ..! పోలీసుల తీరును ప్రశ్నించాలని ఒత్తిళ్లు..!

రష్యాపై విధించిన ఆంక్షలు అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందే అమెరికా వాటిని ఎత్తేసిన నేపథ్యంలో మార్కో రూబియో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు, అమెరికాలో ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో, రష్యా ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డీజిల్ ఒప్పందాన్ని ప్రకటించారు. రష్యా ఇంధన దిగుమతులు మరియు రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం గతంలో తీసుకున్న కఠిన వైఖరికి భిన్నంగా ఈ రెండు చర్యలు గణనీయమైన మార్పును తెచ్చాయి. అమెరికా ఎత్తేసిన ఆంక్షలు భారత్, చైనా, మరో మూడు దేశాలకు ఊరటనిచ్చాయి. ఒకవేళ ఈ ఆంక్షలు విధించి ఉంటే, ఆయా దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించాల్సి వచ్చేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+