విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్- ఈ రైళ్ల పొడిగింపు..!

తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ వేళ ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు పండుగ ముగించుకుని తిరిగి వెళ్లే వారితో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలకు ప్రత్యేక జన్ సాధారణ్ రైళ్లు (Dussehra Special Trains) నడుపుతున్న దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఇప్పటికే నడుపుతున్న నాలుగు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించింది.

విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- రేపటి నుంచి ఈ రైళ్లు..!
విజయవాడ-తిరుపతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్- రేపటి నుంచి ఈ రైళ్లు..!

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-తిరుపతి మధ్య నడిచే జనసాధారణ ప్రత్యేక రైళ్ల సేవలను దక్షిణ కోస్తా రైల్వే పొడిగించింది. ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 21 నుంచి 24 వరకూ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో రైలు నంబర్ 07717: విశాఖపట్నం - విజయవాడ జనసాధారణ ప్రత్యేక రైలు అక్టోబర్ 21 నుంచి 24 వరకు నడుస్తుంది.

Dussehra Special Trains Vijayawada Visakhapatnam Vijayawada Tirupati Services Extended Till October 24
సికింద్రాబాద్ -విశాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపు ఎల్లుండి మీ కోసం..!
సికింద్రాబాద్ -విశాఖ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపు ఎల్లుండి మీ కోసం..!

అలాగే రైలు నంబర్ 07718 విజయవాడ - విశాఖపట్నం జనసాధారణ ప్రత్యేక రైలు అక్టోబర్ 21 నుంచి 24 వరకు పొడిగించారు. రైలు నంబర్ 07250 తిరుపతి - విజయవాడ జనసాధారణ ప్రత్యేక రైలు కూడా అక్టోబర్ 21 నుంచి 24 వరకు పొడిగించారు. చివరిగా రైలు నంబర్ 07249 విజయవాడ - తిరుపతి జనసాధారణ ప్రత్యేక రైలు కూడా అక్టోబర్ 21 నుంచి 24 వరకు నడపబోతున్నారు. దసరా సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి ఈ ప్రత్యేక రైళ్ల సేవల పొడిగింపు ఉపయోగపడనుంది. కాబట్టి దసరా ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+