రైళ్లలో ఫోన్‌లో పాటలు వింటున్నారా? రూ.1000 జరిమానా.. రైల్వే శాఖ కీలక హెచ్చరిక!

రైలు ప్రయాణంలో మొబైల్ ఫోన్లో సాంగ్స్ వినడం, సినిమాలు చూడటం చాలామందికి అలవాటు. అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా స్పీకర్ మోడ్‌లో ఎక్కువ సౌండ్ పెట్టి పాటలు వినడం, సినిమాలు చూడటం వల్ల తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో, రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్లలో స్పీకర్ మోడ్‌లో పాటలు వినడం, వీడియోలు చూడటం లేదా తోటి ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించేలా గట్టిగా మాట్లాడటంపై నిషేధం విధించింది. జర్నీ చేసేటప్పుడు ఇతరులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు హెడ్‌ఫోన్లు వాడాలని, సంభాషణలు ప్రశాంతంగా సాగించాలని సూచించింది.

డెంగ్యూకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసిందా? భారత్‌లో తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!
డెంగ్యూకు చెక్ పెట్టే వ్యాక్సిన్ వచ్చేసిందా? భారత్‌లో తొలి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం!

ఈ మేరకు నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దక్షిణ రైల్వే తన పరిధిలోని అన్ని డివిజన్లను ఆదేశించింది. రైల్వే స్టేషన్లలో పబ్లిక్ అనౌన్స్‌మెంట్లు, నోటీసు బోర్డుల ద్వారా ప్రయాణీకుల్లో అవగాహన పెంచాలని తెలిపింది. అంతేకాకుండా నిబంధనలు పాటించని వారిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు టికెట్ తనిఖీ అధికారులకు(టీటీఈ) పూర్తి అధికారాలు కల్పించింది.

Indian Railways Ban on Loud Mobile Use Fine of Rs 1000 for Playing Audio on Speaker Details

రైల్వే చట్టంలోని సెక్షన్ 145(2)(ఏ) ఆధారంగా ఈ చర్యలు చేపట్టనున్నారు. స్పీకర్ మోడ్‌లో ఫోన్లు ఉపయోగించడం లేదా బిగ్గరగా మాట్లాడటం ద్వారా తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తే.. అలాంటి వారిని రైలు లేదా రైల్వే ప్రాంగణం నుంచి కిందకు దించేయడంతో పాటు రూ.1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

విజయ్ దేవరకొండలో ఇంత మార్పా? 'రణబాలి’తో ఫ్యాన్స్‌కు సరికొత్త ట్రీట్!
విజయ్ దేవరకొండలో ఇంత మార్పా? 'రణబాలి’తో ఫ్యాన్స్‌కు సరికొత్త ట్రీట్!

ముఖ్యంగా ఏసీ కోచ్ లలో ప్రశాంత వాతావరణం ఉంటుందని, అక్కడ గంటల కొద్దీ గట్టిగా మాట్లాడటం, భారీగా సౌండ్ వచ్చే రింగ్‌టోన్లు, హెడ్‌ఫోన్లు లేకుండా ఆడియో ప్లే చేయడం వల్ల ఇతర ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని రైల్వేశాఖ పేర్కొంది. ప్రయాణీకులు ఫోన్లలో సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియా రీల్స్ పెద్ద సౌండ్‌తో చూడటం, పిల్లలకు కూడా స్పీకర్ మోడ్‌లోనే కార్టూన్లు పెట్టడం వల్ల తోటి ప్రయాణీకుల నిద్రకు, ప్రశాంతతకు భంగం కలుగుతోందని అధికారులు తెలిపారు.

ప్రయాణంలో ఎవరైనా ఈ విధంగా ఇబ్బంది కలిగిస్తుంటే వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలని లేదా 'రైల్ మదద్' పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. రైలు ప్రయాణాన్ని అందరికీ ఆహ్లాదకరంగా మార్చేందుకు ఫోన్ సంభాషణలను తక్కువ శబ్ధంతో ముగించాలని, ఆడియో వినేటప్పుడు కచ్చితంగా ఇయర్‌ఫోన్లు ధరించాలని రైల్వే అథారిటీ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+