డీలిమిటేషన్ పై అన్నామలై ప్రతిపాదనలు: నమ్మకం దెబ్బతింటోంది

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని వి ద లీడర్స్ వ్యవస్థాపకుడు అన్నామలై అన్నారు. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణ భారత రాష్ట్రాలు ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా ఎలాంటి అన్యాయానికి గురికాకూడదని స్పష్టం చేశారు. కోయంబత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. దేశ రాజకీయ ప్రాతినిధ్యంపై రాబోయే దశాబ్దాల పాటు తీవ్ర ప్రభావం చూపే ఈ ప్రక్రియపై కేంద్రం తగిన సంప్రదింపులు జరపాలని చెప్పారు.

ప్రస్తుత జనాభా ప్రాతిపదికన ఒక్కో లోక్‌సభ ఎంపీ దాదాపు 20 నుంచి 25 లక్షల మంది నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోందని, విస్తారమైన ప్రాంతాలను నిర్వహించడం కష్టతరమౌతోన్నందున పునర్విభజన అవసరమేనని అన్నామలై అభిప్రాయపడ్డారు. ప్రాతినిధ్యాన్ని 50 శాతం పెంచుతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో ఇచ్చిన హామీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో స్పష్టంగా లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.

Delimitation Must Be Fair says Annamalai to Centre Against Disadvantaging Southern States Consensus

కేంద్ర ప్రభుత్వం తన ప్రణాళికలను స్పష్టంగా వివరించడమే కాకుండా, ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను భాగస్వామ్యం చేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలను రూపొందించడం ద్వారా మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ విజయవంతమౌతుందని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పద అంశాలపై స్పష్టమైన ఏకాభిప్రాయ సాధన అత్యవసరమని, అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అది సమాఖ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని చెప్పారు.

ఆందోళనలకు బ్రేక్ ఇచ్చిన అభిజిత్ దిప్కే: బిగ్ స్టేట్‌మెంట్
ఆందోళనలకు బ్రేక్ ఇచ్చిన అభిజిత్ దిప్కే: బిగ్ స్టేట్‌మెంట్

కాక్రోచ్ జనతా పార్టీ నాయకుల అరెస్టు, వారిని సుదీర్ఘకాలం పాటు కస్టడీలో ఉంచడం, ఢిల్లీ పోలీసుల వ్యవహార శైలి పట్ల అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం చట్టబద్ధ పాలనపై అనుమానాలు రేకెత్తిస్తోన్నాయని వ్యాఖ్యానించారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన విధానాలతో తాను పూర్తిగా ఏకీభవించట్లేదని, అయినపప్పటికీ వారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు.

ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్
ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్

ఇటువంటి సుదీర్ఘ నిర్బంధాలు నేతలను బలహీనపరచడానికి బదులు మరింత బలోపేతం చేస్తాయని, ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదని అన్నామలై తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగంపైనా మాట్లాడారాయన. దేశం అన్ని వర్గాల ప్రజలకు చెందినదని పునరుద్ఘాటించారు. ముస్లిం సహా ఇతర మైనారిటీ వర్గాలకు దేశంలో స్థానం లేదని భావించే వారి ఆలోచన సరైనది కాదని భగవత్ గతంలో అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్
ఎల్లుండి.. న్యూజిలాండ్ లో టీమిండియా మొదటి టీ20: టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ డీటెయిల్స్

సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోవడమే భారతీయ విశ్వజనీన సంస్కృతికి మూలస్తంభమని అన్నామలై పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా భారత్, దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక నాగరికతకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఇటువంటి తరుణంలో పాలకులతో పాటు ప్రతి పౌరుడు భారతీయ విలువలను నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+