భారత్ మూల్యం చెల్లించుకుంటుంది: పాక్ ఆర్మీ చీఫ్

రావల్పిండి: భారత్‌ను పూర్తి స్థాయిలో ఎదుర్కునే సత్తా తమకు ఉందని, భారత్ దుస్సాహసానికి పాల్పడితే భరించరానంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ అన్నారు. అంతర్గత, విదేశీ ప్రమాదాలను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ సాయుధ బలగాలు పూర్తి స్ధాయిలో సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.

1965లో భారత్‌తో జరిగిన యుద్ధానికి గుర్తుగా జరిగిన రక్షణ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఏ స్థాయిలో, ఏ రీతిలో శత్రువు దుస్సాహానికి పాల్పడినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

 India will have to pay 'unbearable cost' in case of war: Pakistan Army chief

భవిష్యత్తులో యుద్ధాలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత ఆరమీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ వ్యాఖ్యలకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ స్పందించారు. దేశ అమరవీరులకు ఆయన నివాళులు అర్పించారు. వారి త్యాగాలు వృధా పోవని చెప్పారు.

గత యాభై ఏళ్లలో పాకిస్తాన్ ఎన్నో ఉత్థానపతనాలను చూసిందని ఆయన అన్నారు. అయితే, మునుపటి కన్నా ఇప్పుడు తాము బలంగా ఉన్నామని చెప్పగలనని, దేశం గతంలో కన్నా అశాజనకంగా ఉందని చెప్పారు.

ఉపఖండం విభజన జరిగినప్పటి నుంచి కూడా కాశ్మీర్ అపరిష్కృత ప్రాంతీయ సమస్య అని ఆయన అన్నారు. కాశ్మీర్ సమస్య ఐక్య రాజ్య సమితి తీర్మానానికి, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కారం కానంత వరకు శాంతి సాధ్యం కాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+