పని మనిషిని కుక్క కంటే హీనంగా చూసిన ఇండియన్-అమెరికన్ సీఈవో, భారీ జరిమానా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: ఇంట్లో పని చేసే వారిని కుక్క కంటే దారుణంగా చూసిన ఇండియన్ అమెరికన్ మహిళా సీఈవోకు షాక్ తగిలింది. పనివారిని దారుణంగా చూసినందుకు రూ.87 లక్షలు జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

భారత దేశానికి చెందిన వ్యక్తి ఆమె ఇంట్లో పని చేసేవారు. ఆ తర్వాత మానేశారు. ఆమెకు సరిగా తక్కువ వేతనం ఇవ్వడం, అలాగే ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించినట్లు తేలడంతో అమెరికా లేబర్ డిపార్టుమెంటు పెద్ద మొత్తంలో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

హిమాన్షు భాటియాపై ఆరోపణలు రుజువు

హిమాన్షు భాటియాపై ఆరోపణలు రుజువు

హిమాన్షు భాటియా. ఈమె రోస్ ఇంటర్నేషనల్ అండ్ ఐటీ స్టాఫింగ్ సీఈవో. ఆమెకు సరైన వేతనం ఇవ్వకపోవడం వంటి ఆరోపణలు తేలడంతో యూఎస్ డిస్ట్రిక్టడ్ కోర్ట్ ఫర్ ది సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా.. ఈ మొత్తాన్ని మాజీ డొమెస్టిక్ వర్కర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

ఏప్రిల్ 11న జడ్జిమెంట్ వచ్చింది. ఆమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ లేబర్‌లో గత ఏడాది ఆగస్టులో కంప్లయింట్ నమోదయింది.

విచారణలో షాకింగ్ విషయాలు

విచారణలో షాకింగ్ విషయాలు

విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. భాటియా ఉద్దేశ్యపూర్వకంగా, పలుమార్లు ఫెడరల్ లేబర్ నిబంధనలు ఉల్లంఘించారని తేలింది. డొమెస్టిక్ హెల్ప్‌కు వేతనం ఇవ్వడంలో జూలై 2012 నుంచి డిసెంబర్ 2014 వరకు ఈ నిబంధనలు ఉల్లంఘించారని తేలింది.

ఫిర్యాదు చేసిన డొమెస్టిక్ హెల్ప్

ఫిర్యాదు చేసిన డొమెస్టిక్ హెల్ప్

భాటియా పైన ఫిర్యాదు చేసిన డొమెస్టిక్ హెల్ప్‌ను షీలా నింగ్‌వాల్‌గా గుర్తించారు. ఆమెకు వేతనం నెలకు 400 డాలర్లుగా ఫిక్స్ చేశారు. వేతనంతో పాటు భోజనం, నివాస సదుపాయం కూడా ఇస్తామని చెప్పారు.

కుక్కల కంటే హీనంగా..

కుక్కల కంటే హీనంగా..

డొమెస్టిక్ హెల్ప్‌ను భాటియా అవమానించినట్లు విచారణలో వెల్లడయింది. ఆమెకు ఆరోగ్యం బాగా లేనప్పుడు కార్పెట్ పైన పడుకోవాలని బలవంతం చేసినట్లుగా తేలింది. కానీ, భాటియా కుక్కలు మాత్రం పక్కనే ఉన్న పరుపు పైన పడుకునేవి. అంతేకాదు, ఆమె పాస్ పోర్టును కూడా దగ్గర ఉంచుకున్నదని తేలింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Investigators found that the employee suffered "callous abuse" and retaliation, including being forced to sleep on a piece of carpet in the garage when ill, while Bhatia's dogs slept on a mattress.
Please Wait while comments are loading...