కాలిఫోర్నియాలో హిందూ ధర్మ స్టడీ సెంటర్‌కు రూ.30 కోట్ల విరాళం
వాషింగ్టన్: హిందూ ధర్మ స్టడీ కేంద్రానికి ఓ ఎన్నారై దంపతులు భారీ విరాళాన్ని ఇచ్చారు. 30 కోట్ల రూపాయలకు పైగా వారు విరాళం ఇచ్చారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయనున్న హిందూ ధర్మ కేంద్రానికి వాళ్లు భూరి విరాళం ఇచ్చారు.
కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేట్ థియోలాజికల్ యూనియన్ యూనివర్సిటీలో హిందూ ధర్మ స్టడీ కేంద్రాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం బే ఏరియాకు చెందిన అజయ్ సింఘాల్, మీరా సింఘాల్ జంట హిందూ అధ్యయన కేంద్రం కోసం ఒక ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రం హిందూ స్టడీస్‌లో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, ఎంఏ, పీహెచ్‌డీ కోర్సులు ఉంటాయి. కేవలం హిందూ మతమే కాకుండా, భారత్‌లో పుట్టిన బౌద్ధ, జైన మతాలపైన కూడా అధ్యయనం నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications