గ్రేట్: కల్పనా చావ్లా తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి.. ఇండో అమెరికన్!
భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంపికయ్యారు. ఈయన పేరు రాజాచారి. కల్పనా చావ్లా తర్వాత నాసా బృందంలో స్థానం పొందిన ఘనత మళ్లీ రాజాచారికి దక్కింది.
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రతిష్ఠాత్మక అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంపికయ్యారు. ఈయన పేరు రాజాచారి. కల్పనా చావ్లా తర్వాత నాసా బృందంలో స్థానం పొందిన ఘనత మళ్లీ రాజాచారికి దక్కింది.
రాజాచారి అమెరికా వైమానిక దళంలో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎఫ్ 35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. వాటర్లూలోని లావాకు చెందిన 39 ఏళ్ల లెఫ్టినెంట్ కల్నల్ చారి తండ్రి శ్రీనివాసా చారి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్లారు. అక్కడ ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.

నాసా భవిష్యత్‌లో నిర్వహించే అంతరిక్ష ప్రయోగాల కోసం రాజాచారితో పాటు 12 మంది మెరికల్లాంటి వ్యోమగాములను ఎంపిక చేసింది. 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రాజాచారి మసాచుసెట్స్ వర్సిటీలో ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చదివారు.
నౌకాదళ టెస్ట్ పైలట్ స్కూల్‌లో కూడా డిగ్రీ చేసిన చారి అమెరికా వైమానిక దళంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. డిఫెన్స్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌తో పాటు 9 విశిష్ఠ సేవా పతకాలు అందుకున్నారు. ఆగస్టులో ఆయన నాసాలో బాధ్యతలు స్వీకరిస్తారు.
తండ్రి హైదరాబాదీ...
నాసా మార్స్‌పైకి పంపించే బృందంలో ఎంపికైన రాజాచారికి హైదరాబాద్‌తో సంబంధం ఉంది. 1942 డిసెంబర్ 28న జన్మించిన రాజాచారి తండ్రి శ్రీనివాస చారి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడి యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. అక్కడే ఓ కంపెనీలో 32 సంవత్సరాలు ఉద్యోగం చేసి, స్థిరపడ్డారు. 1964లో వివాహం చేసుకున్న శ్రీనివాస చారికి ఇద్దరు కుమారులు. ఒకరు క్రిష్ణాచారి కాగా... మరొకరు రాజాచారి. క్రిష్ణాచారి చికాగోలో నివాసం ఉంటున్నారు. ఈ విధంగా రాజాచారి హైదరాబాద్‌కు సంబంధం ఉన్న వ్యక్తి అయ్యారు. శ్రీనివాసా చారి 2010లో చనిపోయారు. రాజాచారి తండ్రి, తాతలు అందరూ ఇక్కడి వారే. ఇప్పటికీ రాజాచారి బంధువులు ఇక్కడున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications