"పుల్వామా, ఉరి, పథాన్ కోట్, ముంబై, పహల్గామ్.. ఎన్ని భరించాలి..?" పాక్ పై భారత్ సంచలనం
UNHRC మీటింగ్ లో పాకిస్థాన్ పై భారత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ టెర్రర్ కార్యకలపాలను ప్రోత్సహిస్తోందని ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ భద్రత ఆందోళనకరంగా మారిందని భారత్ మండిపడింది. ఈ సమావేశంలో పహల్గాం అటాక్, ఉసామా బిన్ లాడెన్ కు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడంపై భారత్ పలు ప్రశ్నలు సంధించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నుంచి తమ దేశానికి గైడెన్స్, సలహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. UNHRC లో భారత్ కు చెందిన శాశ్వత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగీ పాకిస్థాన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
దేశ రాజధాని దిల్లీలో జరిగిన 60 వ UNHRC సమావేశంలో పాకిస్థాన్ చర్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. పాకిస్థాన్ ఉగ్రమూకలను పెంచి పోషిస్తోందని తెలిపింది. పాకిస్థాన్ క్రాస్- బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని UNHRC లో భారత్ కు చెందిన శాశ్వత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగీ మండిపడ్డారు. కానీ అంతర్జాతీయ వేదికల్లో భారత్ పైనే అబండాలు వేస్తోందన్నారు. దేశ ప్రజల భద్రత, రక్షణ విషయంలో భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నుంచి తాము సలహాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
భారత్ పై పాకిస్థాన్ దాడులు నిర్వహించిందని త్యాగీ తెలిపారు. పుల్వామా, ఉరి, పథాన్ కోట్, ముంబై దాడులు, పహల్గామ్.. ఇలా లిస్టు పెరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఒసామా బిన్ లాడెన్ ను దాచిపెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. పాకిస్థాన్ టెర్రర్ కార్యకలపాలను ప్రోత్సహిస్తోందని ఇలాంటి చర్యల వల్ల ప్రపంచ భద్రత ఆందోళనకరంగా మారుతోందని మండిపడ్డారు.
ఇక ఇటీవల పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మే 10న పాకిస్థాన్ చేపట్టిన ఆపరేషన్ బన్ యాన్ మర్సూస్ లో భారత్ కు చెందిన ఆరు ఫైటర్ జెట్స్ ను కూల్చేశామని.. పాకిస్థాన్ ఒక్క జెట్ ను కూడా కోల్పోలేదని కీలక ఆరోపణలు చేశారు. భవిష్యత్తులో మరిన్ని జెట్లను కూల్చేస్తామన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడమే కాకుండా వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

అంతేకాక పాకిస్థాన్ పై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేసింది. సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, ఇరు దేశాల మధ్య వాణిజ్యం రద్దు, వీసాల జారీ రద్దు, గగనతలం మూసివేత.. తదితర నిర్ణయాలతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ కొట్టింది.












Click it and Unblock the Notifications