పాక్‌లో సోదరుడ్ని కలిసింది, ఆమె మరణించింది

Indian meets brother in Pak, dies of heart attack
లాహోర్: పాకిస్తాన్‌లో విషాదకరమైన స్థితిలో భారత మహిళ మరణించింది. ఓ భారతీయ మహిళ 16 ఏళ్ల తర్వాత తన సోదరుడిని పాకిస్తాన్‌లోని లాహోర్‌ రైల్వే స్టేషన్‌లో కలిసిన వెంటనే గుండెపోటుతో మరణించింది.

సరళ జెవాత్రం బద్లానీ లర్కానాలో నివసిస్తున్న తన సోదరుడు మహేష్ కుమార్‌ను కలవడానికి వచ్చింది. తన సోదరి వచ్చిన వెంటనే తనను కౌగలించుకుని బోరున విలపించడం ప్రారంభించిందని మహేష్ కుమార్ చెప్పారు. 16 ఏళ్ల తర్వాత తన సోదరుడిని కలిసిన ఆనందాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. మహారాష్ట్రలోని ఉల్హసన్‌నగర్‌లో ఆమెకు పాస్‌పోర్టు జారీ ఏయింది.

తన సోదరి వీసాను నాలుగు సార్లు తిరస్కరించారని, ఐదో సారి దరఖాస్తుకు వీసా జారీ చేశారని, దాంతో ఆమె లాహోర్‌కు రాగలిగిందని మహేష్ కుమార్ చెప్పారు. తన సోదరి శవాన్ని తీసుకుని వెళ్లడానికి తన కుటుంబానికి వెంటనే వీసాలు ఇవ్వాలని ఆయన జియో టీవీతో మాట్లాడుతూ కోరారు.

అంత్యక్రియలకు హాజరు కావడానికి వీసాకు మహేష్ కుమార్ దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యతా ప్రాతిపదికపై ఇస్తామని భారత హై కమిషన్ అధికారులు పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. మానవతా దృక్పథానికి, వైద్యానికి సంబంధించిన వీసాలను ప్రాధాన్యతా ప్రాతిపదికపై జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+