ఆస్ట్రేలియాలో భారత్ కు చెందిన నిండు గర్భిణిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడు..!!

ఆస్ట్రేలియాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన ఓ మహిళ దుర్మరణం పాలయ్యారు. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణమైన ఓ టీనేజర్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేశారు.

మృతురాలి పేరు సమన్విత ధారేశ్వర్. వయస్సు 33 సంవత్సరాలు. సిడ్నీలో ఐటీ అనలిస్ట్ గా పని చేస్తోన్నారు. భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సిడ్నీ శివార్లలోని హార్న్స్ బైలో నివసిస్తోన్నారు. నిండు గర్భిణి కావడం వల్ల భర్త, కుమారుడితో కలిసి వాకింగ్ చేస్తోన్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన BMW కారు ఆమెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె గాల్లోకి ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

Indian-Origin Pregnant Woman Killed in Sydney Car Crash

హార్న్స్ బే పార్కింగ్ గ్యారేజ్ ప్రవేశ ద్వారం వద్ద ధారేశ్వర్ నడుచుకుంటూ వెళ్తుండగా.. వారిని చూసిన ఓ వ్యక్తి తన కియా కారును స్లో చేశాడు. బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ దీన్ని ఊహించ లేదు. అదే వేగంతో వచ్చి కియా కారును వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టాడు. బీఎండబ్ల్యూ కారు ఢీ కొట్టిన వేగానికి కియా ముందుకు దూసుకెళ్లింది. పార్కింగ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సమన్విత ధారేశ్వర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే ఆమెను వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. సమన్వితను గానీ, ఆమె కడుపులోని బిడ్డను గానీ డాక్టర్లు రక్షించలేకపోయారు. ఈ ఘటనకు కారణమైన బీఎండబ్ల్యూ కారు డ్రైవర్ ఆరోన్ పాపజోగ్లు అనే టీనేజ్ యువకుడిని పోలీసులు అరెస్టు అచేశారు. ఘటన తర్వాత అతను సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. కారు నంబర్ ఆధారంగా అడ్రస్ ను గుర్తించారు. వాహ్రూంగా నివాసంలో నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వయస్సు 19 సంవత్సరాలే.

2022లో న్యూ సౌత్ వేల్స్ జోయ్స్ లాను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం- పుట్టబోయే బిడ్డ మరణానికి కారణమయ్యే నేరాలకు కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రమాదకర, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలాంటి మరణానికి కారణమైన నేరస్థులు వారి ప్రాథమిక శిక్షకు అదనంగా మూడు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+