ఇండియన్ ప్రయాణీకులను అవమానించిన చైనా ఎయిర్‌లైన్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: భారత ప్రయాణీకులతో షాంఘై పుడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చైనీస్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన సత్నమ్‌సింగ్ అనే ప్రయాణీకుడు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చాడు.

ఈ నెల 6వ, తేదిన చైనీస్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లో శాన్‌ప్రాన్సిస్కోకు ప్రయాణీస్తున్న సమయంలో పలువురు భారత ప్రయాణీకులను ఎయిర్‌లైన్స్ సిబ్బంది అవమానించారని ఆయన సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకువచ్చారు.

Indian passenger alleges misbehaviour by Chinese airline staff, India takes up issue with China

ఈ విషయమై ఎయిర్‌పోర్ట్ అధికారుల దృష్టికి కూడ దీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. అయితే అక్కడి అధికారులు కూడ తనపైనే ఆగ్రహన్ని ప్రదర్శించారని ఆయన చెప్పారు.

భారత్,చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఆ అధికారులు ఈ రకంగా వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆరోపణలను చైనీస్ ఎయిర్‌లైన్స్ సంస్థ తీవ్రంగా ఖండించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India has taken up with China a complaint filed by an Indian passenger alleging misbehaviour with Indians at the Shanghai Pudong international airport by the staff of a Chinese airline,
Please Wait while comments are loading...