గాల్లోనే గాలిలో కలిసిపోయిన నిండు ప్రాణాలు: మృతుడు భారత సంతతి వ్యక్తి
అబుదాబి: న్యూఢిల్లీ నుంచి మిలాన్ వెళుతున్న విమానంలో భారత్‌కు చెందిన వ్యక్తి హఠాన్మరణం పొందడంతో పైలట్లు విమానంను అబుదాబి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. మృతి చెందిన వ్యక్తిని 52 ఏళ్ల కైలాష్ చంద్ర సైనీగా గుర్తించారు. ఇటలీలో నివసిస్తున్న కైలాష్ చంద్ర రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడని అధికారులు తెలిపారు.
ఇక మిలాన్‌కు కైలాష్ చంద్రతో పాటు అతని కొడుకు హీరాలాల్ సైనీ కూడా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం అబుదాబిలోని భారత ఎంబసీ కైలాష్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు అన్ని విధాలా సహకరిస్తోంది. ఇందుకు కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్‌ను దగ్గరుండి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ఇక న్యూఢిల్లీలోని అధికారులతో చర్చలు జరుపుతున్నామని అబుదాబిలోని భారత ఎంబసీలో అధికారులు తెలిపారు.

అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సోమవారం అర్థరాత్రి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యిందని భారత ఎంబసీ అధికారి రాజమురుగన్ చెప్పారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మఫ్‌రఖ్ హాస్పిటల్‌కు మృతదేహాన్ని తరలించామని చెప్పారు.అబుదాబి అధికార యంత్రాంగం ఇప్పటికే డెత్ సర్టిఫికేట్ జారీ చేసిందని ఆఫీసర్లు తెలిపారు.ఇతిహాద్ విమానంలో తన తండ్రి మృతదేహం తీసుకుని భారత్‌కు హీరాలాల్ చేరుకుంటారని అధికారులు వివరించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications