ఇదెక్కడి క్రేజ్ మావా!: పాక్‌ను వణికిస్తున్న భారతీయ సినిమా!!

భారతీయ స్పై థ్రిల్లర్ 'ధురందర్' పాక్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు ఈ సినిమా పాకిస్థాన్ వ్యతిరేక ప్రచారంతో కూడి ఉందని పాక్ సర్కారు ఈ సినిమాను నిషేధించగా.. మరోవైపు ఆ దేశ ప్రజలు, చివరకు కీలక రాజకీయ నేతలు కూడా ఈ సినిమా మాయలో పడిపోతున్నారు. పాకిస్థాన్‌లో 'ధురందర్'పై నిషేధం కొనసాగుతున్నప్పటికీ, ఆ సినిమాలోని పాటలు మాత్రం అక్కడ మారుమోగిపోతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) అధినేత బిలావల్ భుట్టో ఒక వేడుకలో ఈ సినిమాలోని వైరల్ సాంగ్ 'FA9LA' కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ధురందర్ పాటకు భుట్టో గ్రాండ్ ఎంట్రీ.. వీడియో వైరల్
ఇటీవల పాకిస్థాన్‌లో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో బిలావల్ భుట్టో వేదికపైకి వస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో 'ధురందర్' సినిమాలోని 'FA9LA' అనే వైరల్ సాంగ్ ప్లే అయ్యింది. బహ్రెయిన్ కళాకారుడు నవాఫ్ ఫహద్ (ఫ్లిప్పరాచీ) పాడిన ఈ పాట సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన నెగటివ్ క్యారెక్టర్ (రెహ్మాన్ డకైత్)కు సంబంధించినది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Indian Spy Thriller Dhurandhar Shakes Pakistan Ban Continues Songs Go Viral

ఈ సినిమాపై భుట్టో పార్టీ న్యాయపోరాటం
విశేషమేమిటంటే.. ఈ సినిమాపై బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కరాచీ కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది. సినిమాలో దివంగత బెనజీర్ భుట్టో ఫోటోలను వాడటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చిత్ర యూనిట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నారు. ఒకవైపు కోర్టులో కేసు వేసి.. మరోవైపు అదే సినిమా పాటను పార్టీల్లో వాడుకోవడం గమనార్హం.

పాకిస్థాన్ ఎందుకు భయపడుతోంది?
1999 కందహార్ విమానం హైజాక్, 26/11 ముంబై దాడులు, పాకిస్థాన్‌లోని ల్యారీ గ్యాంగ్ వార్ల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ ఒక ఉగ్రవాద దేశమని ఈ సినిమాలో చూపించడం అక్కడి పాలకులకు మింగుడు పడటం లేదు. ఐఎస్ఐ ఈ సినిమాను అడ్డుకోవాలని చూసినా పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ఈ సినిమాను అక్రమంగా డౌన్‌లోడ్ చేసుకుని చూశారు. పాకిస్థాన్‌లో అత్యధికంగా పైరసీకి గురైన సినిమాగా 'ధురందర్' రికార్డు సృష్టించింది. రజనీకాంత్ '2.0', షారుఖ్ ఖాన్ 'రాయీస్' రికార్డులను కూడా ఇది అధిగమించింది. రణ్‌వీర్ సింగ్ ఇందులో హమ్జా అనే భారతీయ గూఢచారిగా నటించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను తుదముట్టించే మిషన్‌లో ఆయన కనిపిస్తారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+