ఆస్ట్రేలియాలో ఉరేసుకుని భారత విద్యార్థి మృతి

మేరీబేర్నాంగ్ ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లోని సెల్‌లో గత విద్యార్థి ఉరేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయంటూ ఫెయిర్‌ఫాక్స్ మీడియా ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది. సెంటర్‌లో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారని ఇమిగ్రేషన్ మంత్రి స్కాట్ మారిషన్ అంటున్నారు.
అతని మృతికి సంబంధించి ఏ విధమైన అనుమానాలు లేవని మారిసన్ అన్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండడంతో అతన్ని జనవరిలో నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుడి కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రొవిన్షియల్ ప్రభుత్వం సానుభూతి తెలిపింది. దర్యాప్తునకు పోలీసులకు, ఇతర అధికారులకు తాము సహకరిస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications