ఏంటీ దారుణం..? అమెరికాలో భారతీయ విద్యార్థికి సంకెళ్లు.. నేలకేసి కొట్టి.. బహిష్కరణ

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్.. తన దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వలసవాదులను తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు. వీసా రూల్స్ ను కఠినతరం చేశారు. దీంతో ప్రపంచ దేశాలతోపాటు భారతీయ విద్యార్థులు సైతం అమెరికా వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

అయితే తాజాగా అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే అగ్రరాజ్యంలోని భారతీయ విద్యార్థులతోపాటు అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సైతం వెన్నులో వణుకు పుట్టక తప్పదు. అమెరికాలోని ఎయిర్ పోర్టులో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించారు.

అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగిన ఓ భారతీయ యువకుడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి దారుణంగా హింసించారు. ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.

Indian Student s Nightmare Handcuffed Tortured and Deported from New York Airport

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కునాల్ జైన్ అనే ఎన్ఆర్‌ఐ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. హృదయ విదారకంగా భావించానని.. ఇది ఒక మానవ విషాదం అని ఎక్స్‌లో పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా అమెరికాలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజెన్లు షాక్ కు గురవుతున్నారు. అమెరికాలో ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

అమెరికాకు వెళ్తున్న అనేక మంది యువత.. తాము ఇక్కడికి ఎందుకు వచ్చామో అధికారులకు వివరించలేక పోతున్నారు. దీంతో వారి ఆగ్రహానికి బలైతున్నారని ఎన్ఆర్ఐ వర్గాలు చెబుతున్నారు. క మానవ విషాదం అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆ భారతీయ విద్యార్థి హర్యానాలో మాట్లాడినట్టు జైన్ తెలిపారు. వీసా పొంది అమెరికా వచ్చే ఇలాంటి పిల్లలు తాము ఎందుకు వచ్చామో అన్నది ఇమ్మిగ్రేషన్ అధికారులకు వివరించలేక పోతున్నారని వివరించారు.

దీంతో అక్కడి అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ.. సంకెళ్లు వేసి తిరుగు విమానంలో పంపుతున్నారని తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+