వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయులను అడ్డుకుంటున్న ఉక్రెయిన్ సైన్యం - రక్షణ కవచాలుగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్ నగరాల పైన రష్యా పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని రష్యా నియంత్రణలోకి తెచ్చుకుంది. ఖీవ్ నగరం లో బాంబులతో దాడులు కొనసాగిస్తోంది. మెట్రో స్టేషన్లలో పేలుళ్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్​లోని ఖార్కివ్‌ నగరం నుంచి భారతీయులు వెళ్లిపోకుండా ఉక్రెయిన్‌ యంత్రాంగం అడ్డుకుంటోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. భారతీయులను ఉక్రెయిన్‌ సైనికులు మానవ రక్షణ కవచాలుగా ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. తమ భూభాగం ద్వారా భారతీయులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా వెల్లడించింది.

Recommended Video

Russia Ukraine Conflict : ఉక్రెయిన్ విడిచి పారిపోయిన 10 లక్షల మంది ప్రజలు..! | Oneindia Telugu
రక్షణ కవచంగా భారతీయులు

రక్షణ కవచంగా భారతీయులు

తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని రష్యా తెలిపింది. ఖార్కీవ్ నగరంలోని భారతీయులు తక్షణం ఖాళీ చేయాలని ఇప్పటికే పలు మార్లు భారత రాయబార కార్యాలయం పలు మార్లు సూచించింది. అవసరమైతే కాలి నడకన అయినా నగరం వీడాలని సూచించింది. ఆ సమయంలో ఉక్రెయిన్ సైన్యం భారతీయులను తమకు రక్షణ కవచంగా వినియోగించుకోంటదనేది రష్యా ఆరోపణ. అయితే భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఈ ఆరోపణలను ఖండించారు. రక్తమోడుతూ కూడా ఉక్రెయిన్​.. విదేశీ పౌరులు దేశం దాటేందుకు సహకరిస్తోందని చెప్పారు.

 అటువంటి సమాచారం లేదన్న విదేశాంగ శాఖ

అటువంటి సమాచారం లేదన్న విదేశాంగ శాఖ


తనకు తెలిసి భారతీయులు ఖార్కివ్‌ నగరాన్ని ఖాళీ చేసి పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు.భారత్ సహా విదేశీ విద్యార్థుల కోసం హాట్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు.. ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ తెలిపింది. ఇదే సమయంలో హంగేరీ, రొమేనియా, స్లొవేకియా, పోలాండ్‌ నుంచి వాయుసేన సహా తొమ్మిది విమానాల్లో మూడు వేల మంది భారతీయులతో బయలుదేరినట్లు విదేశాంగమంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. వాటిలో కొన్ని భారత్ చేరాయి. రాత్రి ఒంటి గంటన్నరకు వాయుసేన విమానం దిల్లీకి చేరుకుంది. మరో వైపు రష్యా - ఉక్రెయిన్ మధ్య ఈ రోజు మరోసారి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ కు దూరం

ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ కు దూరం

ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో రష్యా తీరును ఐరాస సర్వ ప్రతినిధి సభ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా నిలిచింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోదీ మాట్లాడారు. భారత విద్యార్థుల్ని సురక్షితంగా తరలించేందుకు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్‌ సమీప దేశాలకు చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.గురువారం ఉదయం కీవ్​లోని డ్రుజ్బీ నరోదివ్​ మెట్రో స్టేషన్​ సమీపంలో రెండు పేలుడు ఘటనలు జరిగినట్లు స్థానిక వార్తాసంస్థ కీవ్​ ఇండిపెండెంట్​ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో వాయుదాడులు జరిగే అవకాశముందని, ప్రజలు షెల్టర్లలోకి వెళ్లాలని సూచించినట్లు పేర్కొంది. కీవ్​లోని కీవ్​ ఒబ్లాస్ట్​, మైకొలెవ్​, లవీవ్​, చెర్నిహివ్​ ఒబ్లాస్ట్​, ఒడెసా సహా పలు ప్రాంతాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

English summary
The Russian Defence Ministry has alleged that the Indian students have been taken hostage by the Ukrainian forces to use them as a “human shield”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X