వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త:కెనడాలో భారత టెక్కీలకు ఉద్యోగాలు, ట్రంప్ కు చెక్

అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయేవారికి కెనడాలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు కెనడా కు చెందిన టెక్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

టోరంటో:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న వీసాల్లో కఠినతరమైన చర్యలతో ఆందోళనలో ఉన్న భారత టెక్కీలకు కెనడా ఆహ్వానం పలుకుతోంది.తమ దేశంలో టెక్నాలజీ సేవలు అందించేందుకుగాను రావాల్సిందిగా కెనడా భారతీయులను ఆహ్వనిస్తోంది.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెక్కీలకు గడ్డు కాలం మొదలైంది. అనేక కఠినతరమైన నిబంధనలను అమల్లోకి తెచ్చాడు ట్రంప్.

కొత్త నిబంధనల కారణంగా ఇండియాలోని ఐటి కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.దీనికితోడు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళి ఐటి కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారికి కూడ ఇబ్బందులు తలెత్తాయి.

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ట్రంప్ ఎన్నికల్లో ప్రజలకు హమీ ఇచ్చాడు.అయితే ఈ హమీ మేరకు ట్రంప్ కొన్ని కొత్త నిబంధనలను అమలు చేశాడు. ఈ నిబంధనల వల్ల ఐటి కంపెనీలు కూడ ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకించాయి.

కెనడా ఆహ్వనం

కెనడా ఆహ్వనం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఐటి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయినవారు తమ దేశంలోకి వచ్చి ఉద్యోగాలు చేయాలని కెనడా ఆహ్వనం పలుకుతోంది.కెనడాలో టెక్ రిక్రూట్ మెంట్ తో పాటు భారీగా పెట్టుబడులు వస్తాయని ఆ దేశం అభిప్రాయపడుతోంది.

అవకాశాలను అందిపుచ్చుకొంటాం

అవకాశాలను అందిపుచ్చుకొంటాం

అమెరికాలో నిషేధం ఉన్నందున కెనడాలో వచ్చి ఉద్యోగాలు చేసుకొనేందుకు వెసులుబాటు ఉందని ఆ దేశానికి చెందిన ఫాంటసీ 360 సిఈఓ షాఫిన్ డైమండ్ తేజని చెప్పారు. వాంకోవర్ చెందిన ఈ కంపెనీ వర్చూవల్ రియాల్టీ , అగ్మెంటెడ్ రియాల్టీ మిక్స్ డ్ రియాల్టీల సహయంతో గేమ్స్ ను అభివృద్ది చేస్తోంది. తాము భారత్ , అమెరికాలో ఉన్న భారత టెక్కీల నుండి వివరాలు సేకరిస్తున్నట్టు తేజని చెప్పారు.

వీసాలు ఇచ్చేందుకు సిద్దం

వీసాలు ఇచ్చేందుకు సిద్దం

అమెరికా అధ్యక్షుడి నిర్ణయాల కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి తమ దేశంలో ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకొంటున్నట్టు చెబుతున్నారు కొన్ని టెక్ కంపెనీలు యజమానులు. కెనడాలో సులభంగా ఉద్యోగాలు చేసేందుకు వీలుగా వీసాలు జారీ చేసేలా చూడాలని ప్రధానికి లేఖ రాసినట్టుగా కెనడియన్ టెక్నాలజీ కమ్యూనిటీ చెబుతోంది.

ఉచితంగా శిక్షణ, ఉద్యోగాలు

ఉచితంగా శిక్షణ, ఉద్యోగాలు

ప్రపంచ వ్యాప్తంగా ప్రతిభావంతులకు ఎంపిక చేసుకొని వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కెనడాలోని టెక్ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. గ్లోబల్ కంపెనీలను తమ దేశంలో స్థాపించి తమ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ది చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కెనడియన్ టెక్నాలజీ కమ్యూనిటీ చెబుతోంది.

భారత టెక్కీలకు ఉద్యోగాలు

భారత టెక్కీలకు ఉద్యోగాలు

టాప్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు కూడ బారత టెక్కీలను కెనడాలో నియమించుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. తాజాగా లాంచ్ అకాడమీ కెనడియన్ స్టార్టప్ ఓ వీసా ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టార్టప్ లు తమ ప్రధాన కార్యాలయాలను కెనడాలో నియమించుకొనేలా అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్ లో ఐదుగురు ప్రధాన వ్యక్తులను వారి కుటుంబసభ్యులకు మరో ఆరు నెలల్లో కెనడాలో శాశ్వత నివాసానికి ఆమోదం తెలపనుంది.

English summary
Indian-origin tech leaders in Canada say the controversial visa and travel restrictions imposed by US President Donald Trump+ will be a boon for tech recruitment and investment in Canada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X