ట్రంప్ ను చావు దెబ్బ కొట్టిన మోడీ..! ఆ కీలక ఒప్పందం రద్దు..?

రష్యా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లూ భారత్ కు మిత్రదేశంగా ఉంటూ ఎంతో ప్రయోజనం పొందిన అమెరికా.. ఇప్పుడు ఈ నిర్ణయంతో భారీ షాక్ ఇచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ప్రధాని మోడీ.. ఇవాళ దెబ్బకు దెబ్బ తీశారు.

ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొంటూ ఆ దేశానికి అండగా నిలుస్తామన్న కారణంతో భారత్ పై 25 శాతం సుంకాలు విధించి ట్రంప్ కక్షసాధింపు చర్యలకు తెరలేపారు. అంతే కాదు అదనంగా జరిమానా కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా రష్యా చమురు కొంటున్న భారత ఆయిల్ రిఫైనరీలపై ఆంక్షలు కూడా విధించారు. దీంతో భారత్ కచ్చితంగా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ అంచనా వేశారు. అయితే ఆయన లెక్క తప్పింది.

india s counter to Donald trump s tariff hike dropped F-35 Jet Deal

భారత్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికాతో ఇప్పటికే ప్రతిపాదిత ఎఫ్35 యుద్ధ విమానాల డీల్ ను రద్దు చేసుకుంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎఫ్35 యుద్ధ విమానాలు ఎక్కడపడితే అక్కడ కూలిపోతుండటం, తాజాగా కేరళలో బ్రిటన్ కు చెందిన అమెరికా తయారీ ఎఫ్35 ఫైటర్ జెట్ లో సమస్యలు తలెత్తి 15 రోజుల పాటు ఎయిర్ బేస్ లోనే ఉండిపోవడం వంటి కారణాల నేపథ్యంలో ఈ డీల్ రద్దు చేసుకుంటూ భారత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మనకు విక్రయించాలని ప్రతిపాదించిన ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి తాము ఆసక్తి చూపడం లేదని తాజాగా అమెరికాకు కేంద్రం చెప్పేసినట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. దానికి బదులుగా మోడీ ప్రభుత్వం దేశీయంగా రక్షణ పరికరాలను సంయుక్తంగా రూపొందించడంపై దృష్టి సారించడంపై ఆసక్తిగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. అయితే అధికారికంగా ఈ డీల్ రద్దయినట్లు కేంద్రం ఎక్కడా ప్రకటించలేదు.

india s counter to Donald trump s tariff hike dropped F-35 Jet Deal

మరోవైపు ఎఫ్ 35 జెట్ల డీల్ రద్దు చేసుకుంటున్నప్పటికీ అమెరికాతో దౌత్య సంబంధాలను మాత్రం యథావిథిగా కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగే ఆలోచనలో కేంద్రం లేదని సమాచారం. అలాగే అమెరికా నుండి సహజ వాయువు కొనుగోళ్లు పెంచడం, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచాలని భావిస్తోంది. దీని వల్ల వచ్చే నాలుగేళ్లలో అమెరికాతో భారత వాణిజ్య లోటు పూడ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+