వదలని పెను భూకంపాలు: సరిగ్గా 9వ రోజు నాడే మళ్లీ: అల్లాడిన చిరు ద్వీపం

Indonesia earthquake: ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే పెను భూకంపం, అదే స్థాయిలో సునామీని చవి చూడాల్సి వచ్చింది. సరిగ్గా తొమ్మిది రోజుల వ్యవధిలో మరోసారి పెను భూకంపం సంభవించింది. ఓ చిన్న ద్వీప సముదాయాన్ని వణికింపజేసింది.

జనవరి 1వ తేదీన జపాన్‌లో సంభవించిన పెను భూకంపం, ఆ వెంటనే ఏర్పడిన సునామీ వల్ల 161 మంది మరణించిన విషయం తెలిసిందే. పలువురు గల్లంతయ్యారు. భవనాల శిథిలాల కింద వారంతా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికీ ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్షర్ రీజియన్‌ తేరుకోవట్లేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Indonesia earthquake: 6.7 magnitude quake hits Talaud islands

జపాన్ భూకంపం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోక ముందే ఇప్పుడు ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున 2:18 నిమిషాలకు భూమి ప్రకోపించింది. ఇండోనేషియాలోని టాలండ్ ఐలండ్‌ను వణికించింది.

టాలండ్ ద్వీపం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఓ చిన్న ద్వీప సముదాయం కావడం, భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల సునామీ సంభవించవచ్చనే భయాందోళనలు తొలుత వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత అలాంటి ప్రమాదమేమీ లేకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు.

ఈ భూకంపం వల్ల సునామీ సంభవించే ప్రమాదం లేదని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఎలాంటి వార్తలు అందలేదు. టాలండ్ ఐలండ్‌లో కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు తెలుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారడం, తీరంలో అలలు పోటెత్తడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీరప్రాంతాన్ని ఖాళీ చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+