ఆ ముస్లిం దేశంతో భారత్ బిగ్ డీల్.. పాకిస్థాన్ కు భారీ షాక్..!

పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు చెందిన అత్యాధునిక క్షిపణి వ్యవస్థ బ్రహ్మోస్.. పాకిస్థాన్ లోని ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లో విధ్వంసం సృష్టించిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అయిన ఇండోనేషియా.. కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఇండోనేషియా రక్షణమంత్రి జఫ్రీ జమ్సోద్దిన్ భారత్ లో రెండు రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది. ఈ మేరకు దిల్లీలోని బ్రహ్మోస్ క్షిపణి ప్రొడక్షన్ యూనిట్ ను సందర్శించారు. ఈ మిసైల్ కు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం అయ్యారు.

భారత్ కు చెందిన సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ బ్రహ్మోస్ ని కొనుగోలు చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశంగా పేరుగాంచిన ఇండోనేషియా సిద్ధం అయింది. ఈ మేరకు భారత్- ఇండోనేషియా మధ్య ఈ ఒప్పందంపై త్వరలోనే ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. బ్రహ్మోస్ క్షిపణిలోని మూడు వెర్షన్లను అంటే ల్యాండ్, నేవల్, ఎయిర్ ఫోర్స్ ను కొనుగోలు చేయాలని ఇండోనేషియా ఆసక్తిని ప్రదర్శిస్తోంది. వీటి కొనుగోలు ద్వారా భారత్‌ తో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇండోనేషియా రక్షణమంత్రి జఫ్రీ జమ్సోద్దిన్ భారత్ లో పర్యటించారు. దిల్లీలోని బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్‌ ను సందర్శించారు. క్షిపణి సామర్థ్యాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారత రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ తో సమావేశమయ్యారు.

ఇక ఈ బ్రహ్మోస్ క్షిపణి ఒప్పందం విలువ రూ. 38,770 మిలియన్లు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఈ క్షిపణులను కొనుగోలు చేసేందుకు భారత్.. తమ జాతీయ బ్యాంకుల నుంచి ఇండోనేషియాకు రుణం కూడా అందించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అయిన ఇండోనేషియాకు భారత్ నుంచి బ్రహ్మోస్‌ ను కొనుగోలు చేయడం పాకిస్థాన్, చైనాలకు కీలక సందేశంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Indonesia Seals BrahMos Deal Largest Muslim Nation Bolsters Arsenal with India s Supersonic Edge

ఇక పాకిస్థాన్ తయారు చేసిన బాబర్, షాహీన్, ఘోరి వంటి క్షిపణులను విక్రయించడానికి సుముఖంగా ఉన్నప్పటికీ, ఇండోనేషియా వాటిని కొనుగోలు చేయలేదు. దాంతో పాకిస్థానీ క్షిపణులపై ఇండోనేషియాకు నమ్మకం లేదని స్పష్టం అవుతోంది. ఇక ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్‌ ను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా నిలిచింది. మరోవైపు వియత్నాం, మలేషియా, బ్రెజిల్, అర్జెంటీనా, వెనిజులా, సౌదీ అరేబియా, ఈజిప్ట్.. తదితర దేశాలు కూడా బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక బ్రహ్మోస్ క్షిపణి.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అధునాతన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా పేరుంది. దీని వేగం మ్యాక్ 2.8.. లేదా గంటకు 3,450 కి.మీ. ఉంటుంది. దీని పరిధి 290 కి.మీ. గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+