
ఇండోనేసియా: ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట, 120 మందికి పైగా మృతి

ఇండోనేసియాలోని ఫుట్‌బాల్ మ్యాచ్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 129 మంది మరణించారు. తూర్పు జావాలో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్ బాల్ మ్యాచ్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
మ్యాచ్ లో పెర్సెబాయా సురాబాయా జట్టు చేతిలో అరేమా ఎఫ్‌సీ జట్టు ఓడిపోయింది. దీంతో రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ మొదలయింది. సుమారు 180 మంది గాయపడ్డారు.
"మద్దతుదారుల పై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో తొక్కిసలాట మొదలైంది" అని తూర్పు జావా పోలీసు అధికారి నికో అఫిన్టా చెప్పారు.
మ్యాచ్ ఫైనల్ విజిల్ తర్వాత అభిమానులు పిచ్ దగ్గరకు పరుగు పెడుతున్నట్లు వీడియోలో కనిపించింది.
"స్టేడియం లోపల 34 మంది మరణించగా, మిగిలిన వారు ఆస్పత్రిలో మరణించారు" అని అఫిన్టా చెప్పారు.
"తొక్కిసలాటలో అందరూ ఎగ్జిట్ పాయింట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ ఒకేసారి అందరూ గుమిగూడడంతో, ఊపిరి అందక కొంత మంది చనిపోయారు" అని చెప్పారు.
సోషల్ మీడియా వీడియోలలో నేల పై పడి ఉన్న మృత దేహాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటన పై విచారణ మొదలుపెట్టినట్లు ది ఇండోనేసియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ తెలిపింది. ఈ ఘటన ఇండోనేసియా ఫుట్ బాల్ ప్రతిష్టకు భంగం కలిగించిందని అన్నారు.
టాప్ లీగ్ బీఆర్‌ఐ లిగా 1ను ఒక వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- 'పస్తులైనా ఉందాం ఆ పనికి మాత్రం వెళ్లొద్దని కాళ్ల మీద పడ్డాం.. ఇప్పుడు మాకెవరు దిక్కు’
- ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)