కొండను ఢీకొన్న విమానం: 54 మంది మృతి
జకార్తా: అదృశ్యమైందనుకున్న ఇండోనేషియాకు చెందిన మరో విమానం ఓ కొండను ఢీకొంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 54 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పపువా రాజధాని జయపురి విమానాశ్రయం నుంచి త్రిగణ ఎయిర్ ఏటీఆర్ 42 అనే ఇండోనేషియా విమానం 54 మంది ప్రయాణికులతో ఒక్సిబిల్ వెళ్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఆ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో సంబంధాలను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పపువా ప్రాంతంలోనే విమానం తప్పిపోయి ఉంటుందని వారు భావించారు.
అక్కడి వాతావరణం అనుకూలించకపోవడం వల్లే విమానం కొండను ఢీకొని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణీకుల్లో 44 మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. త్రిగణ అనేది ఇండోనేషియాకు చెందిన విమానయాన సంస్థ.

4.8 తీవ్రతతో నేపాల్‌లో కంపించిన భూమి
ఖాట్మాండ్: నేపాల్‌లో ఆదివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టార్ స్కేలుపై 4.8గా నమోదు అయింది. రాజధాని ఖాట్మాండ్‌కు 110 కిలో మీటర్ల దూరంలో దోల్క జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని తెలిపారు. శనివారం కూడా నేపాల్‌లో రెండు సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల 9వేల మంది మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications