వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా బంగారమే: డొనాల్డ్ ట్రంప్ విమానం ప్రత్యేకతలు ఎన్నో!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన పదునైన మాటలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఆయన మాటలే కాదు ఆయన ఉపయోగించే వాహనం కూడా ప్రత్యేకమే. ఎన్నికల ప్రచారం కోసం ఆయన వినియోగించే విమానాన్ని అమెరికా అధ్యక్షుడి విమానమైన ఎయిర్ ఫోర్స్ వన్‌తో పోలుస్తున్నారు.

వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రొడ్యూసర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ట్రంప్ అమెరికా అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్నాడు. తొలుత ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత హిల్లరీ కంటే వెనుకబడ్డాడు. ఇటీవల తిరిగి పుంజుకున్నాడు. ఆయన తన మాటలతో విమర్శలు మూటకట్టుకున్నాడు.

ట్రంప్ తన కోసం ఓ ప్రత్యేక విమానాన్ని బోయింగ్ 757 వినియోగించాడు. ఈ విమానాన్ని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అల్లెస్ నుంచి ట్రంప్ కొన్నాడు. అనంతరం తన అభిరుచికి తగినట్లుగా డిజైన్ చేయించాడు. సమావేశ మందిరాలు, బెడ్రూం, బాత్రూంలతో పాటు లగ్జరీ సీట్లతో సదుపాయాలు అమర్చుకున్నాడు. విమానంలో 24 క్యారెట్ల బంగారపు పూత ఉంటుందట. బాత్రూం నల్లాలకు కూడా బంగారం పూత ఉంటుందంటున్నారు.

Inside Donald Trump's Private Jet

అమెరికా అద్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్. దీని విలువ రూ.325 మిలియన్ డాలర్లు. ట్రంప్ విమానం విలువ రూ.100 మిలియన్ డాలర్లు. దీనిని ట్రంప్ ఫోర్స్ వన్‌గా పిలుస్తున్నారు. ఈ విమానంలో అధికారిక మీడియా సమావేశాలకు అనుకూలంగా ఉంటుంది. రక్షణ సిబ్బంది అందుబాటులో ఉంటుంది.

ఇందులో డ్రెస్సింగ్ రూం, షవర్లు, జిమ్‌లు కూడా ఉన్నాయి. చాఫ్ అండ్ ప్లేర్స్ అనేవి శత్రువుల క్షిపిణులను మిస్ గైడ్ చేస్తాయి. అలాగే ఈసీఎం ద్వారా శత్రువుల రాడార్లను జాం చేయవచ్చు. విమానంలో కూర్చొనే న్యూక్లియర్ అటాక్ చేసే సదుపాయం కూడా ఉందట. ప్రతి కిటికీ బుల్లెట్, బాంబు ప్రూఫ్‌లతో ఉంటుంది.

English summary
Donald Trump purchased Microsoft co-founder Paul Allen's Boeing 757 for around $100 million and gave it a Trump-style makeover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X