వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఫోన్‌.. అంటే అంతేమరి! పది రోజుల ముందునుంచే ఓ వీరాభిమాని పడిగాపులు!

ఆస్ట్రేలియాలో ఐఫోన్‌ ఎక్స్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సిడ్నీకి చెందిన మేజెన్‌ తొలి ఐఫోన్‌ ఎక్స్‌ కోసం ఇప్పట్నించే ఆస్ట్రేలియాలోని యాపిల్‌ స్టోర్‌ ముందు కూర్చున్నాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

iPhone X Launch : A Man lines up in Sydney 10 days early ఐఫోన్‌..అంటే అంతేమరి! | Oneindia Telugu

ఆస్ట్రేలియా: టెక్‌ దిగ్గజం యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ సీరీస్‌లో 'ఐఫోన్‌ ఎక్స్‌'ను నేటి అర్ధరాత్రి మార్కెట్లోకి తీసుకురానుంది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది.

ఆస్ట్రేలియాలో ఐఫోన్‌ ఎక్స్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే సిడ్నీకి చెందిన మేజెన్‌ అనే 20 ఏళ్ల యువకుడు మొట్టమొదటి ఐఫోన్‌ ఎక్స్‌ తనకే దక్కాలని ఇప్పటి నుంచే ఆస్ట్రేలియాలోని యాపిల్‌ స్టోర్‌ ముందు పడిగాపులు పడుతున్నాడు.

iphone-fan-mazen

యూనివర్శిటీ ఆఫ్‌ న్యూసౌత్‌ వేల్స్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న మేజెన్‌ ఐఫోన్‌ అభిమాని. గతేడాది ఐఫోన్‌ 7 విడుదల సమయంలో కొనుగోలు చేసిన వారిలో మూడో స్థానంలో ఉన్నానని ఐఫోన్‌ కోసం ఇలా వేచిచూడటంలో తప్పులేదని చెబుతున్నాడు.

సెప్టెంబర్‌ 22న తాను ఐఫోన్‌ ఎక్స్‌ను కొనుగోలు చేసే దృశ్యాన్ని వీడియో తీసి తన ఫ్రెండ్స్‌ కోసం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తానంటున్నాడు మేజెన్‌. ఉదయం పూట షోరూం ముందు మేజెన్‌ కూర్చుంటే రాత్రి వేళల్లో తన స్నేహితులను కూర్చోబెడుతున్నాడు.

అయితే కొత్త ఫోన్‌ తీసుకున్నాక తన పాత ఐఫోన్‌ను అమ్మేస్తానని మేజన్‌ చెప్పాడు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మేజెన్‌ రూపొందించిన ఎనిమిది యాప్స్‌ కూడా ఉన్నాయట. యాపిల్‌ వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌ నుంచి మేజెన్‌ రెండుసార్లు స్కాలర్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు.

2016 సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 7 విడుదలైనప్పుడూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రదేశాల్లో ప్రజలు ఏకంగా బారులు తీరారు. సిడ్నీ, హాంగ్‌కాంగ్‌, టోక్యో తదితర నగరాల్లోని యాపిల్‌ స్టోర్ల ఎదుట గంటల తరబడి నిలబడ్డారు. మరికొందరైతే ఆయా స్టోర్ ల తలుపులు తెరవకముందే వచ్చేసి పడిగాపులు పడ్డారు.

English summary
The 10th anniversary iPhone hasn’t even been officially announced, yet there are already people camped outside Apple’s George St store in Sydney to ensure they are the first to secure the new device when it goes on sale. While there is no official release date for the forthcoming device, rumours suggest the iPhone X will go on sale in Australia on September 22, which means the keen punters have a long 10-day wait ahead of them.Having lined up to be one of the first iPhone 7 customers last year, Mazen Kourouche knows what to expect from the gruelling slog of camping on the footpath next to a construction site for days on end, but believes it will once again be worth the effort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X