ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అతనే..! ట్రంప్ కు షాక్..!
ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధం వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అసెంబ్లీ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తమకు తగిన నేతను ఎన్నుకున్నట్లు ఇరాన్ నేతలు పేర్కొన్నారు. కానీ కొత్త సుప్రీం లీడర్ ఎవరు అనేది ప్రకటించేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపింది. ఇరాన్ అసెంబ్లీలోని మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు సుప్రీం నేతను ఎన్నుకున్నట్లు సమాచారం.
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా గతవారం సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమైన విషయం తెలిసిందే. ఖమేనీతో పాటు అతని కుటుంబ సభ్యులు, అలాగే దాదాపు 40 మంది ఇరాన్ నేతలు హతం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ను ఎన్నుకుంది.
ఇక ఇరాన్ లోని అసెంబ్లీలో మొత్తం 88 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ లోని మత పెద్దల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశం అయినట్లు సమాచారం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందరూ ఒకే చోట సమావేశం కావడం వీలు పడదని తెలుస్తోంది. ఇదే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి ముందు .. తన తర్వాత ఎన్నుకునే నేత ఇరాన్ శత్రు దేశాలు తీవ్రంగా ద్వేషించే వ్యక్తి అయి ఉండాలని సూచించినట్లు ఖమేనీ సన్నిహితుడు మోస్సేన్ హైదరీ పేర్కొన్నారు.
ఇక త్వరలోనే ఇరాన్ సుప్రీం లీడర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల వల్లే ఇరాన్ తాజా సుప్రీం లీడర్ పేరును ప్రకటించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ పై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

గల్ఫ్ దేశాలపై దాడులు చేయడంపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. దాంతో పెజెష్కియాన్ వ్యాఖ్యలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై దాడులను ఉద్ధృతం చేస్తామని తేల్చారు. ఇరాన్ లొంగిపోయేంత వరకూ యుద్ధం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇదిలాఉంటే అమెరికాకు లొంగి పోయే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.
-
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
అమెరికా 'యుద్ధ విమానాలు' కాదు అట్ట పెట్టెలు.. మా 'రఫేల్' నయం..! -
ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ‘బాబ్ అల్ మాండెబ్’..? -
యూఎస్ తో తలపడుతున్న ఇరాన్ బలాలేంటి? యుద్ధంలో ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? -
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్ -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
ఆ పైలట్ ట్రంప్ వద్ద కంటే ఇరాన్ లోనే సురక్షితం" -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..











Click it and Unblock the Notifications