మొస్సాద్ తో లింక్స్- వారిని ఉరి తీసిన ఇరాన్..!!
ఇజ్రాయెల్ తో భీకర యుద్ధాన్ని కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థుల్లో ఇరాన్ దిగ్భ్రాంతికర చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయనే కారణంతో ముగ్గురిని ఉరి తీసింది. ఇరాన్ లోని పశ్చిమ ప్రాంతం లోని అజర్ బైజాన్ ప్రావిన్స్ లో గల ఉర్మియా జైలులో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి.
ఈ నెల 13వ తేదీన ఇజ్రాయెల్ తో యుద్దం ఆరంభమైన తరువాత ఉరిశిక్షను అమలు చేయడం ఇది రెండోసారి. ఈ రెండు వారాల వ్యవధిలో మొత్తంగా ఆరుమంది ఖైదీలను ఉరి తీసినట్టయింది. తొలి విడతలో ఇదే ఉర్మియా కారాగారంలో ముగ్గురికి మరణశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. తాజాగా మరో ముగ్గురిని ఉరి కంబం ఎక్కించింది.

ఇరాన్ ఈ మరణశిక్షను అమలు చేసినట్లు ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖ, పోలీసు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది. ఉరిశిక్షను ఎదుర్కొన్న వాళ్లు తమ దేశంలోకి హత్యా సామగ్రిని తీసుకువచ్చారని పేర్కొంది.
గతంలో ఇజ్రాయెల్ నుంచి దాడులు ఎదుర్కొన్నప్పుడు ఇరాన్ అనేకసార్లు ఉరిశిక్షలను అమలు చేసింది. తాజా యుద్ధం ఆరంభమైన తరువాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఈ రెండు వారాల వ్యవధిలో ఆరుమందిని ఉరికొయ్యకు వేలాడదీసినట్టయింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత కూడా మరణశిక్షలు అమలు కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
ఆజాద్ షోజై, ఇద్రిస్ ఆలీ, రసౌల్ అహ్మద్ రసౌల్ గా ఇరాన్ గుర్తించింది. వీరిలో రసౌల్ అహ్మద్.. ఇరాక్ జాతీయుడు. ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ఈ ముగ్గురినీ ఇదివరకే అరెస్ట్ చేసింది. తమ దేశ భద్రత సహా ఇతర సున్నిత సమాచారాన్ని మొస్సాద్ కు చేరవేస్తోన్నట్లు గుర్తించింది.
వీరిని కూడా ఇజ్రాయెల్ ఉరి తీయవచ్చని గతంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. వారికి క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చేసింది గానీ అది సాధ్యపడలేదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి రాజీ ధోరణి ప్రదర్శించదలచుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రు దేశానికి రహస్య, సున్నిత సమాచారాన్ని చేరవేసే వారికి మరణశిక్ష తప్పదనీ హెచ్చరించింది.
-
పారాసెటమాల్, బీపీ టాబ్లెట్ల రేట్లు భారీగా పెంపు? -
అమెరికా యుద్ధ విమానాల్లో నుంచి దూకేసిన పైలట్లు-పట్టిస్తే ఇరాన్ భారీ బౌంటీ..! -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
యుద్ధం వేళ అమెరికా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు -
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
F-35 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. అమెరికాలో చేయి దాటిన పరిస్థితి! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications